Bengaluru Playoff: టాటా ఐపీఎల్‌ సీజన్‌లో అత్యంత పేలవ ప్రదర్శనతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మరోసారి ట్రోఫీకి దూరమయ్యే అవకాశం ఉంది. ఏడో ఓటమితో ప్లేఆఫ్స్‌ అవకాశాలను దాదాపుగా దూరం చేసుకుంది. ఈసారి స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ మళ్లీ నిరాశ తప్పడం లేదు. లీగ్‌లోకి ప్రవేశించి 17 ఏళ్లయినా ఇంతవరకు ఆర్‌సీబీ ట్రోఫీ అందుకోకపోవడం బెంగళూరు అభిమానులను కలచివేసే విషయం.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: DC vs SRH Highlights: సన్‌రైజర్స్‌ మరో సంచలన విజయం.. ఢిల్లీని మడతబెట్టిన నటరాజన్‌


తాజా సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఒక్క మ్యాచ్‌ మినహా అన్నింటా పరాజయం మూటగట్టుకుంది. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. కోల్‌కత్తాతో జరిగిన 8వ మ్యాచ్‌లో బెంగళూరు ఓడి ఏడో ఓటమిని చవిచూసింది. దీంతో లీగ్‌లో ప్లేఆఫ్స్‌ అవకాశాన్ని దాదాపుగా కోల్పోయింది. ఇంకా 6 లీగ్‌ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ ఆరు మ్యాచ్‌ల్లోనూ అన్నింటా గెలిచినా కూడా ప్లేఆఫ్స్‌కు వెళ్లే అవకాశాలు కూడా కష్టమే. ఆరు మ్యాచ్‌లు గెలిచినా కూడా ఇతర జట్ల ప్రదర్శనను బట్టి ఆర్‌సీబీ భవిష్యత్‌ ఆధారపడి ఉంటుంది.

Also Read: IPL GT vs DC Highlights: ఢిల్లీ క్యాపిటల్స్‌ సంచలనం.. గుజరాత్‌ టైటాన్స్‌కు దారుణ పరాభవం


బౌలింగ్‌ దారుణం
ప్రస్తుతం జట్టు పరిస్థితి చూస్తుంటే జరగాల్సిన ఆరు మ్యాచ్‌ల్లో కనీసం మూడు కూడా గెలిచే పరిస్థితి లేదు. వాటిలో ముఖ్యంగా దూకుడు మీద ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఢీకొట్టాల్సి ఉంది. పరుగుల వరద పారిస్తూ అన్ని జట్లను బెంబేలెత్తిస్తున్న హైదరాబాద్‌ ఆర్‌సీబీని ఉతికి ఆరేసే అవకాశం ఉంది. ఎందుకంటే బెంగళూరు బ్యాటింగ్‌ బలంగా ఉన్నా బౌలింగ్‌ మాత్రం అత్యంత పేలవంగా ఉంది. హైదరాబాద్‌ మొదట బ్యాటింగ్‌కు దిగితే మాత్రం బెంగళూరు బౌలర్లను ఊచకోత కోస్తారు. 300 పరుగులు సాధించాలనే పట్టుదలతో ఉన్న సన్‌రైజర్స్‌కు బెంగళూరు మ్యాచ్‌ చక్కటి అవకాశం. పొరపాటున హైదరాబాద్‌ ఆరోజు మొదట బ్యాటింగ్‌కు దిగితే టీ20 క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత భారీ స్కోర్‌ నమోదయ్యే అవకాశం ఉంది.


జట్టు ఎంపిక తప్పిదం
ఐపీఎల్‌ వేలంపాటలోనే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిర్వాహకులు భారీ తప్పులు చేశారు. జట్టు ఎంపిక అంటే బ్యాటర్లతోపాటు బౌలర్లు ఉండాల్సి ఉంది. జట్టులో అన్ని రంగాల్లో ప్రదర్శన కనబర్చే ఆటగాళ్లు ఉండాలి. కానీ వేలంపాటలో ఆటగాళ్ల ఎంపికతో ఆర్‌సీబీ భారీ తప్పులు చేసిన ఫలితంగా ప్రస్తుతం జట్టు దయనీయ పరిస్థితికి దారితీసింది. బ్యాటింగ్‌పరంగా జట్టు పరవాలేదనిపించినా.. బౌలింగ్‌ మాత్రం చెత్తగా ఉంది. నిలకడ లేని బౌలర్లతో జట్టు భారీ మూల్యం చెల్లించుకుంటోంది. ఫామ్‌లో లేని మహ్మద్‌ సిరాజ్‌తో జట్టు కొంత నష్టపోయింది. ప్రస్తుతం ఉన్న బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు. కానీ మెరుగైన ప్రదర్శన కనబర్చాల్సి ఉంది. హర్షిత్‌ రానా, మిచెల్‌ స్టార్క్‌, సునీల్‌ నరైన్‌, సుయాష్‌ శర్మ, ఆండ్రె రసెల్‌ తమ బౌలింగ్‌కు పదును పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.


చేతులు కాలాక..
ఇప్పుడు ఎన్ని ప్రయోగాలు.. ఎంత కష్టపడినా కూడా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈసారి కప్‌ దూరమైపోయినట్టే. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటామంటే కుదరదు. లీగ్‌ ప్రారంభంలోనే జట్టు లోపాలను సరిదిద్దుకుని ఉంటే ఇంతటి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉండేది కాదు. భారమంతా విరాట్‌ కోహ్లీ మోస్తున్నాడు. టీ20 ప్రపంచకప్‌కు సన్నద్ధమవుతున్న కోహ్లీ ఐపీఎల్‌లోనూ సత్తా చాటుతున్నాడు. పరుగుల వరద పారిస్తున్నా అతడికి సహకరించే వారు ఎవరూ లేరు. స్కోర్‌ భారీగా చేసినా కూడా బౌలర్లు మ్యాచ్‌ను చేజారుస్తున్నారు. ఒక్కడే ఎంత అని చేయగలడు. కోహ్లీ ఒంటరి పోరాటం వృథా అవుతోంది. ఈ సీజన్‌లోని లోపాలను దిద్దుకుని వచ్చే సీజన్‌కు సిద్ధమైతే 2025లోనైనా బెంగళూరుకు కప్‌ దక్కే అవకాశం ఉంటుంది. కప్‌ నమ్‌దే అనే దానికి బెంగళూరు ఎప్పుడూ నిజం చేస్తుందో వేచి చూడాలి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter