IPL 2024 SRH vs MI: ఐపీఎల్ 2024 సీజన్ 17లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ సరికొత్త రికార్డుల్ని సృష్టించింది. ఒకటి కాదు రెండు కాదు...వరుస రికార్డులులు నమోదయ్యాయి. ఒకే ఒక్క మ్యాచ్..523 పరుగుల వరద పారింది. 38 సిక్సర్లు స్డేడియంలో హోరెత్తించాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే రెండు జట్ల బ్యాటర్లు కలిపి విధ్వంసం అంటే ఏంటో చూపించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య బుధవారం మార్చ్ 27వ తేదీ మ్యాచ్ చరిత్ర సృష్టించి చరిత్రలో నిలిచిపోయింది. సమీప భవిష్యత్తులో ఎవరూ టచ్ చేయలేని రికార్డుల హోరు రేపింది. ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అత్యధిక స్కోరు 277 పరుగులు నమోదు చేసింది. అటు ప్రత్యర్ధి జట్టు ముంబై ఇండియన్స్ లక్ష్య సాధనలో 246 పరుగులు చేసింది. వెరసి రెండూ జట్లు కలిపి 523 పరుగులు చేయడం ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ జరగలేదు. జరగబోదు కూడా. ఇక ఇదే మ్యాచ్‌లో సిక్సర్ల రికార్డు క్రియేట్ అయింది. రెండు జట్లు కలిపి 38 సిక్సర్లతో స్డేడియం మార్మోగించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 18 సిక్సర్లు కొడితే ముంబై ఇండియన్స్ జట్టు 20 సిక్సర్లు నమోదు చేసింది. 


ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్లు


2024- సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ 277/3
2013- ఆర్సీబీ వర్సెస్ పూణే వారియర్స్ 263/5
2023  లక్నోసూపర్ జెయింట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ లెవెన్ 257/5
2016- ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ లయన్స్ 248/3
2010- చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ 246/5


ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు


2024- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ 38 సిక్సర్లు
2018-ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే 33 సిక్సర్లు
2020- రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సీఎస్కే 33 సిక్సర్లు
2023- ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే 33 సిక్సర్లు


ఐపీఎల్ చరిత్రలో 10 ఓవర్లలో అత్యధిక స్కోరు


2024-ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ ఎంఐ 148/2
2024-ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ 141/2
2021-ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ 131/3
2014-పంజాబ్ కింగ్స్ లెవెన్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ 131/3
2008-దెక్కన్ ఛార్జర్స్ వర్సెస్ ముంబై ఇండియ్స్ 130


Also read: NPS New Rules: నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో కొత్త రూల్స్, ఏప్రిల్ 1 నుంచి అమలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook