IPL Playoff scenarios: గత ఐపీఎల్ సీజన్స్ తో పోలిస్తే.. ఈ 17 ఎడిషన్ ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. పాత రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఇప్పటికే అన్నీ జట్లు కనీసం 8, గరిష్ఠంగా 10 మ్యాచ్ లు ఆడేశాయి. ఢిల్లీ, గుజరాత్, ఆర్సీబీలకు మరో నాలుగు మ్యాచులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇన్ని మ్యాచ్ లు జరిగినా ఫ్లే ఆఫ్ రేసులో ఉండే జట్లు ఏవో క్లారిటీ రాలేదు. సన్ రైజర్స్ హైదరబాద్ వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోయి ఈ రేసును మరింత రవవత్తరంగా మార్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అడుగు దూరంలో రాజస్థాన్..
ఐపీఎల్ పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచ్ లలో 8 గెలిచి ఫ్లే ఆఫ్ రేసులకు ఒక్క అడుగు దూరంలో ఉంది. ఇంకో మ్యాచ్ గెలిస్తే ఆ జట్టు ఫ్లే ఆఫ్ బెర్త్ ఖాయం అవుతుంది. రాజస్థాన్ తర్వాత వరుసగా కేకేఆర్, సీఎస్కే, ఎస్ఆర్ హెచ్, లక్నో, ఢిల్లీ జట్లు ఉన్నాయి. ఈ ఐదు జట్లు ఐదేసి విజయాలతో పది పాయింట్లు సాధించి రెండు నుంచి ఆరు స్థానాల వరకు ఉన్నాయి. గుజరాత్ నాలుగు మ్యాచులు గెలిచి ఎనిమిది పాయింట్లతో ఉంది. పంజాబ్, ముంబై, ఆర్సీబీ మూడేసి మ్యాచుల్లో గెలిచి ఆరు పాయింట్లతో చివరి మూడు స్థానాల్లో ఉన్నాయి. 


ఫ్లే ఆఫ్ అవకాశాలను క్లిష్టం చేసుకున్న హైదరాబాద్..
రాజస్థాన్ తర్వాత ఫ్లే ఆఫ్ అవకాశాలు ఎక్కువగా ఉండేది  కోల్‌కతాకే. ఆ జట్టు 8 మ్యాచుల్లో ఆరు గెలిచింది, మరో ఆరు మ్యాచులు మిగిలి ఉన్నాయి. అందులో సగం గెలిచిన అయ్యర్ సేన ఫ్లే ఆఫ్ రేసులో ఉంటుంది. సన్ రైజర్స్ పై నిన్న విజయం సాధించి నెట్ రన్ రేట్ భారీగా మెరుగుపరుచుకుంది చెన్నై. దీంతో ఆ జట్టు కూడా ఫ్లే ఆఫ్ రేసులో ఉండే అవకాశం ఉంది. వరుసగా రెండు మ్యాచులు ఓడి హైదరాబాద్ ప్లేఆఫ్స్ బెర్తును సంక్లిష్టం చేసుకుంది. లక్నోకు కూడా ఛాన్స్ లు ఎక్కుగానే ఉన్నాయి. 


డేంజర్ జోన్ లో ఆ ఐదు జట్లు..
ఇక ఢిల్లీ, గుజరాత్ అయితే పదేసి మ్యాచులు ఆడేశాయి. పంత్ సేన మిగిలిన ఉన్న నాలుగు మ్యాచుల్లోనూ, గిల్ సేన ఐదు మ్యాచుల్లోనూ గెలిస్తేనే ఫ్లే ఆఫ్ రేసులో ఉండే అవకాశం లేదు. అట్టడుగున్న ఉన్న పంజాబ్, ముంబై, ఆర్సీబీ జట్టు రేసులో నిలవాలంటే అన్ని మ్యాచుల్లోనూ అది కూడా భారీ తేడాతో గెలుపొందాల్సి ఉంటుంది. ఆర్సీబీ ఇప్పటికే పది మ్యాచులు ఆడేసింది. ఆ నాలుగు మ్యాచుల్లోనూ గెలిచిన పెద్దగా ఒరిగేదేమీ లేదు. ఆ జట్టు దాదాపు ఇంటిదారి పట్టడం పక్కాగా కనిపిస్తోంది. 


Also Read: T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌కు పంత్ పిక్స్.. తలనొప్పిలా మారిన ఆ ఇద్దరు?


Also read: T20 World Cup 2024: గిల్, రాహుల్‌కు నో ఛాన్స్.. టీ20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగబోయే భారత జట్టు ఇదే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook