IPL 2024 CSK List: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, ఐపీఎల్ ఆడనున్న ధోనీ, ఆరుగురిని విడుదల చేసిన సీఎస్కే
IPL 2024 CSK List: ఐపీఎల్ 2024 వేలం ప్రక్రియలో కీలకమైన రిటెన్షన్ అండ్ రిలీజ్ జాబితాలు వచ్చేశాయి. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాళ్ల ఇన్ అండ్ అవుట్ వివరాలు ప్రకటించేసింది. సీఎస్కే సైతం భారీగా ఆటగాళ్లను వదిలించుకుంది.
IPL 2024 CSK List: ఐపీఎల్ 2024 వేలానికి ముందు కీలకమైన ఆటగాళ్ల రిటెన్షన్ , రిలీజ్ జాబితాల ప్రక్రియ ముగిసింది. ఐపీఎల్‌లోని మొత్తం 10 ఫ్రాంచైజీలు ఏ ఆటగాళ్లను విడుదల చేసింది, ఎవరిని కొనసాగిస్తున్నదీ జాబితాలు ప్రకటించాయి. సీఎస్కే జాబితా మాత్రం ధోనీ అభిమానుల్లో ఆనందం నింపింది. మరోసారి ధోనీ ఆడనున్నాడని తేలడంతో సంబరపడిపోతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17 లో భాగంగా వచ్చే నెల అంటే డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా మెగా వేలం జరగనుంది. ఇందులో భాగంగా ఇవాళ మొత్తం 10 జట్లు ఆటగాళ్ల రిటెన్షన్ , రిలీజ్ జాబితాలు వెల్లడించాయి. డిఫెండింగ్ ఛాంపియన్ అయినా సరే సీఎస్కే కఠిన నిర్ణయాలే తీసుకుంది. సరైన ఆటతీరు కనబర్చకుండా జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లను వదిలించేసుకుంది. పని ఒత్తిడి, ఇతర కారణాలతో బెన్ స్టోక్స్ ఒక్కడే తనకు తానే తప్పుకోగా అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించాడు. మరో ఆరుగురిని సీఎస్కే రిలీజ్ చేసేసింది.
ఐపీఎల్ 2024 నుంచి మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకుంటాడనే వార్తలు విన్పించాయి. కారణంగా ఇప్పటికే 42 ఏళ్లు వచ్చేశాయి. వాస్తవానికి ఐపీఎల్ 2023లోనే ఆడతాడా లేడా అనే సందేహాలు విన్పించాయి. కానీ అభిమానుల మద్దతుతో ఆడటమే కాకుండా సారధ్యం వహించి ఐదవసారి టైటిల్ సాధించిపెట్టాడు. ఇప్పుడు 8 మంది ఆటగాళ్ల రిలీజ్ ద్వారా సీఎస్కే వ్యాలెట్ 32.5 కోట్లకు చేరుకుంది. 9 స్లాట్స్ ఖాళీ ఆయ్యాయి. అందుకే ఈసారి వేలంలో గట్టిగానే ప్రయత్నించనుంది.
చెన్నై సూపర్‌కింగ్స్ రిలీజ్ లిస్ట్
డ్వైన్ పిట్రోరియస్, భగత్ వర్మ, సుభ్రాంశు సేనాపతి, ఆకాష్ సింగ్, కైల్ జేమిసన్, ఎస్ మగలా
చెన్నై సూపర్‌కింగ్స్ రిటైన్ లిస్ట్మహేంద్ర సింద్ ధోని, రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే
దీపక్ చాహర్, తుషార్ దేశ్ పాండే, మహేశ్ తీక్షణ, సిమ్రంజీత్ సింగ్, మతీష పతిరన, ప్రశాంత్ సోలంకి, మిచెల్ సాంట్నర్, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, శివమ్ దూబే, ఆజింక్య రహానే, నిశాంత్ సింధు, షేక్ రషీద్, అజయ్ మండల్
Also read: IPL 2024 SRH List: భారమైన ఆటగాళ్లను వదిలించుకున్న ఎస్ఆర్‌హెచ్, బ్రూక్‌కు గుడ్ బై
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook