IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం ఈసారి భారీ ఎత్తున జరగనుంది. అన్ని ఫ్రాంచైజీలు భారీగా ఆటగాళ్లను రిలీజ్ చేయడంతో దిగ్గజ ఆటగాళ్లంతా బరిలో సిద్ధమయ్యారు. అటు బీసీసీఐ కూడా సౌదీ అరేబియాలోని జెద్దాలో రెండ్రోజులు ఈ మెగా వేలం నిర్వహించనుంది. అటు ఫ్రాంచైజీలు కూడా భారీ వ్యాలెట్‌తో రంగంలో దిగుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2025 మెగా వేలం సమీపిస్తోంది. మరో నాలుగు రోజుల్లో అంటే నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో అత్యంత ఘనంగా మెగా వేలం జరగనుంది. 2008 ఐపీఎల్ మొదటి సీజన్‌లో ఒక్కో ఫ్రాంచైజీ వద్ద 21.75 కోట్లుంటే ఈసారి అతి తక్కువ వ్యాలెట్ 41 కోట్లతో రాజస్థాన్ రాయల్స్ జట్టు బరిలో దిగుతోంది. ఈ ఏడాది వేలం విలువ 120 కోట్లు కావడంతో వేలం భారీగా ఉండనుంది. రెండ్రోజులపాటు జరగనున్న వేలానికి 1574 మంది ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకుంటే 574 మంది షార్ట్ లిస్ట్ అయ్యారు. ఈసారి వేలంలో ఐపీఎల్ మాజీ కెప్టెన్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఫాఫ్ డుప్లెసిస్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. గత ఏడాది 24.75 కోట్లతో అత్యధిక ధర పలికిన ఆసిస్ బౌలర్ మిచెల్ స్టార్క్ సైతం బరిలో ఉన్నాడు. 


ఈసారి వేలంలో అందరి దృష్టీ ప్రధానంగా రిషభ్ పంత్‌పై ఉంది. బ్యాటింగ్, వికెట్ కీపింగ్, కెప్టెన్సీలో సత్తా చూపుతున్నాడు. రిషభ్ పంత్‌కు భారీ ధరే పలకవచ్చని తెలుస్తోంది. అటు కేఎల్ రాహుల్ కూడా రికార్డు స్థాయిలో ధర పలకనున్నాడు. ఇక స్టార్ కెప్టెన్ కోసం ఎదురుచూసే ఫ్రాంచైజీలకు ఐపీఎల్ 2024 టైటిల్ కేకేఆర్ జట్టుకు అందించిన శ్రేయస్ అయ్యర్ బెస్ట్ ఆప్షన్ కానున్నాడు. వేలానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు హెన్రిచ్ క్లాసెన్‌ను అత్యధికంగా 23 కోట్లతో రిటైన్ చేసుకుంది. విరాట్ కోహ్లీని ఆర్సీబీ 21 కోట్లకు, నికోలస్ పూరన్‌ను 21 కోట్లతో లక్నో సూపర్ జెయింట్స్ రిటైన్ చేసుకున్నాయి.


ఈసారి వేలంలో పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ జట్టు అత్యధికంగా 110.5 కోట్లతో బరిలో దిగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 83 కోట్లు, ఢిల్లీ కేపిటల్స్ 73 కోట్లతో బరిలో దిగనుంది. ఇక ఈసారి వేలంలో అందరి దృష్టినీ ఆకర్షించి అత్యధిక ధర పలికే ఆటగాళ్లలో జోస్ బట్లర్, మిచెల్ స్టార్క్, రబాడ, డేవిడ్ మిల్లర్, మొహమ్మద్ షమి, మొహమ్మద్ సిరాజ్, జేమ్స్ అండర్సన్ ఉన్నారు. 


Also read: IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం తుది జాబితా ఇదే, 574 మంది ఆటగాళ్లు ఏ సెట్‌లో ఎవరెవరంటే>



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.