IPL 2025 Auction: ఐపీఎల్ 2024 రిటెన్షన్ జాబితాలో కొత్త నిబంధనల ప్రకారం గరిష్టంగా 5-6 గురిని రిటైన్ చేసుకున్నాయి. కొన్ని జట్లు ఇద్దరిని మాత్రమే రిటైన్ చేసుకోగా మరి కొన్ని జట్లు 1-2 స్థానాలు మిగిల్చాయి. కొన్ని జట్లు ఊహించని రీతిలో కెప్టెన్లను వదిలేసుకున్నాయి. ఆ జట్లు, రిలీజ్ అయిన కెప్టెన్ల వివరాలు ఇలా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోల్‌కతా నైట్‌రైడర్స్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ టైటిల్ సాధించిన పెట్టిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను వదులుకుని రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, రమన్ దీప్ సింగ్‌లను రిటైన్ చేసుకుంది. ఇక ఢిల్లీ కేపిటల్స్ కూడా రిషభ్ పంత్‌ను వదులుకుని అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, స్టబ్స్, అభిషేక్ పోరెల్‌లను రిటైన్ చేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ కూడా కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను వదులుకుని నికోలస్ పూరన్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, మోహిసిన్ ఖాన్, ఆయుష్ బదోనిలను రిటైన్ చేసుకుంది. 


అదే విధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఊహించినట్టే కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌ను వదులుకుని విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, యశ్ దయపాల్‌లను రిటైన్ చేసుకుంది. ఇక పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టు కూడా తమ కెప్టెన్ శిఖర్ థావన్‌ను వదులుకుని శశాకం సింగ్, ప్రభ్‌మన్ సిమ్రాన్ సింగ్‌ను రిటైన్ చేసుకుంది. 


వేలంలో స్టార్ ఆటగాళ్లు


ఫాఫ్ డుప్లెసిస్, మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ షమీ, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, మిల్లర్ తో పాటు గత సీజన్‌లో కేకేఆర్ జట్టు 24.75 కోట్లకు దక్కించుకున్న ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కూడా వేలంలో ఉన్నాడు. 


రిలీజ్ అయిన కెప్టెన్లు


ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, డిల్లీ కేపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్, కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్


Also read: SRH Retained List: ఆ ఐదుగురిపై అపార నమ్మకం పెట్టుకున్న కావ్య పాప, భారీ ధర చెల్లింపు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.