Tilak Varma Bought By Mumbai Indians For INR 1.7 Crore: బెంగళూరు వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలంలో హైదరాబాద్‌ ఆటగాళ్లపై కనక వర్షం కురుస్తోంది. శనివారం జరిగిన తొలిరోజు వేలంలో ముగ్గురు తెలుగు ఆటగాళ్లు అమ్ముడు పోయిన విషయం తెలిసిందే. రెండో రోజైన ఆదివారం మరో ఆటగాడికి జాక్ పాట్ తగిలింది. యువ ప్లేయర్ తిలక్‌ వర్మను ముంబై ఇండియన్స్ కైవసం చేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరొందిన ముంబై ఇండియన్స్‌ హైదరాబాద్ ప్లేయర్ తిలక్‌ వర్మను 1.70 కోట్లకు  కొనుగోలు చేసింది. తిలక్‌ వేలల్లోకి రాగానే చాలా జట్లు ఆసక్తి చూపాయి. అతడికోసం ముంబై, చెన్నై, రాజస్థాన్, హైదరాబాద్ పోటీపడ్డాయి. చివరకు హైదరాబాద్, ముంబై మధ్య గట్టి పోటీ ఎదురైంది. అయితే హైదరాబాద్ రేసు నుంచి తప్పుకోవడంతో.. ముంబై తిలక్‌ వర్మను 1.70 కోట్లకు కైవసం చేసుకుంది. 


ఇటీవల ముగిసిన దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో 19 ఏళ్ల తిలక్‌ వర్మ 180 పరుగులు చేశాడు. టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో 215 పరుగులు చేశాడు. అండర్‌ 19 ప్రపంచకప్‌ 2020 గెలిచిన భారత జట్టులో కూడా తిలక్‌ సభ్యుడు. అతను 15 గేమ్‌లలో 29.30 సగటుతో 381 పరుగులు చేశాడు. అందులో 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ 2022 వేలంలో భారీ ధర రావడంతో అతడి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. 



హైదరాబాద్‌కు చెందిన భారత సీనియర్ ఆటగాడు అంబటి రాయుడును చెన్నై సూపర్‌ కింగ్స్‌ రూ. 6.75 కోట్లకు తిరిగి కొనుగోలు చేసింది. వైజాగ్‌ ఆటగాడు శ్రీకర్‌ భరత్‌ను రూ. 2 కోట్లకు, నెల్లూరు క్రికెటర్‌ అశ్విన్‌ హెబ్బర్‌ను రూ. 20 లక్షల కనీస ధరకు ఢిల్లీ క్యాపిటల్స్‌ సొంతం చేసుకొంది. తాజాగా ముంబై ఇండియన్స్‌ హైదరాబాద్ ప్లేయర్ తిలక్‌ వర్మను 1.70 కోట్లకు  కొనుగోలు చేసింది.


Also Read: పాపం.. ఒక్క ఏడాదిలో అంతా తలక్రిందులాయే! ఆ భారత ఆటగాడికి అప్పుడు 9 కోట్లు.. ఇప్పుడు 90 లక్షలు!!


Also Raed: IPL 2022 Mega Auction: పంజాబ్​కు అల్​ రౌండర్ లివింగ్​ స్టోన్​- రూ.11.50 కోట్లకు కొనగోలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook