IPL Auction 2022: ఈ ఏడాది ఆడకున్నా.. ఆ స్టార్ ఆటగాడిపై కోట్లు కుమ్మరించిన ముంబై! కారణం ఏంటంటే?
IPL Auction 2022 Live Updates Jofra Archer: ఐపీఎల్ 2022 మెగా వేలంలో ముంబై ఇండియన్స్ జట్టు ఇంగ్లండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ను 8 కోట్లకు కొనుగోలు చేసింది.
Mumbai Indians Purchase Jofra Archer For Rs 8 Crore: బెంగళూరు వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలంలో ఇంగ్లండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌కు జాక్ పాట్ తగిలింది. ఆర్చర్‌ను ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ రూ.8 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లతో పోటీపడి మరీ భారీ ధరకు కైవసం చేసుకుంది. ఐపీఎల్ 2022లో పేసర్లు చాలా ధరనే పలుకుతున్నారు కదా.. మరి ఆర్చర్‌కు ఈ ధర రావడం జాక్ పాట్ ఏంటి అనుకుంటున్నారా?. విషయంలోకి వెళితే..
2019 వన్డే ప్రపంచకప్ అనంతరం ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ మోచేతి గాయంతో గాయపడ్డాడు. దాంతో 2020లో తన మోచేతికి శస్త్రచికిస్త చేయించుకున్నాడు. శస్త్రచికిస్త కారణంగా 2021లో పూర్తిగా ఆటకు దూరమయ్యాడు. అంతర్జాతీయ మ్యాచులతో పాటు ఎలాంటి లీగ్స్ ఆడలేదు. గాయం నుంచి కోలుకుంటున్న ఆర్చర్.. ఐపీఎల్ 2022 కూడా ఆడనని ముందే చెప్పాడు. అయితే ఇది మెగా వేలం కావడంతో.. తన పేరును నమోదు చేసుకున్నాడు. 2 కోట్ల కనీస ధరతో వేలల్లోకి రాగా.. రాజస్థాన్, హైదరాబాద్, ముంబై జట్లు పోటీ పడ్డాయి. హైదరాబాద్ అగట్టిపోటి ఇచ్చినా ముంబై వెనక్కి తగ్గలేదు.
అయితే ఐపీఎల్ 2022లో జోఫ్రా ఆర్చర్ ఆడకున్నా.. ముంబై ఇండియన్స్ కొనుగోలు చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి. ట్రెంట్ బోల్ట్ ను వదులుకోవడంతో జస్ప్రీత్ బుమ్రాకు సరైన జోడి కోసం అతడిని తీసుకుంది. ఐపీఎల్ టోర్నీలోనే కాకండా టీ20ల్లో ఆర్చర్ రికార్డులు బాగుండడం ఇంకో కారణం. ఈ ఒక్క ఆసీజన్ ఆడకున్నా.. 2023లో ఆర్చర్ కచ్చితంగా ఆడతాడు. ఈ రెండు కారణాలతో ముంబై కనుగోలు చేసింది. ఆర్చర్ తొలిసారిగా 2018లో ఐపీఎల్ ఆడి ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
జోఫ్రా ఆర్చర్ 2018 సీజన్‌లో10 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. 2019లో 11 మ్యాచ్‌లలో 11 వికెట్లు తీశాడు. అప్పుడు ఆర్చర్ ఎకానమీ రేటు ఓవర్‌కు 6.76 పరుగులుగా ఉంది. 2020లో14 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు పడగొట్టాడు. ఈసారి ఎకానమీ రేటు ఓవర్‌కు 6.55గా ఉంది. ఇక టీ20 ఫార్మాట్‌లో మొత్తంగా 121 మ్యాచ్‌లు ఆడి 153 వికెట్లు తీశాడు. అతడి అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 18 పరుగులకు 4 వికెట్లు. పవర్‌ప్లే, డెత్ ఓవర్లలో కూడా ఆర్చర్ అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. అతని యార్కర్, షార్ట్ బంతులకు ప్రత్యర్థి వద్ద సమాధానమే ఉండదు.
Aslo Read: Tilak Varma: హైదరాబాద్ యువ ఆటగాడిపై కనక వర్షం.. భారీ ధరకు కొనుగోలు చేసిన ముంబై!!
Also Read: పాపం.. ఒక్క ఏడాదిలో అంతా తలక్రిందులాయే! ఆ భారత ఆటగాడికి అప్పుడు 9 కోట్లు.. ఇప్పుడు 90 లక్షలు!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook