Sunrisers Hyderabad Full Squad for IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌)కు అంతగా కలిసిరాలేదు. లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్‌ల్లో 8 ఓడిపోయి.. 6 విజయాలు మాత్రమే సాధించిన సన్‌రైజర్స్ ప్లే ఆఫ్ చేరుకోలేకపోయింది. పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2023 కోసం ఓ బలమైన జట్టును తయారు చేసుకునేందుకు ముందుగానే ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే  కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌తో పాటు 13 మంది ఆటగాళ్లను 2023 వేలంలోకి వదిలేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

12 మంది ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకొన్న ఎస్‌ఆర్‌హెచ్‌.. రూ.42.25 కోట్ల అత్యధిక పర్స్‌ మనీతో ఐపీఎల్ 2023 మినీ వేలం బరిలోకి దిగింది. వేలం ఆరంభంలోనే ఇంగ్లండ్ యువ బ్యాటర్ హరీ బ్రూక్‌ను రూ.13.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. రాజస్థాన్ రాయల్స్‌తో పోటీపడి మరీ ఎస్‌ఆర్‌హెచ్‌ ఓనర్ కావ్య మారన్ అతడిని దక్కించుకుంది. సన్‌రైజర్స్ ఓ ఆటగాడి కోసం ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేయడం ఇదే తొలిసారి. పంజాబ్ కింగ్స్ వదిలేసిన భారత ప్లేయర్ మయాంక్ అగర్వాల్‌ను రూ.8.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. బెంగళూరు, పంజాబ్, చెన్నైలతో పోటీపడి మరీ అగర్వాల్‌ను దక్కించుకుంది. 


దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ హెన్రీచ్ క్లాసె‌న్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ రూ.5.25 కోట్లు ఖర్చు చేసింది. ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ కోసం రూ.2 కోట్లు వెచ్చించింది. అయితే అనామక ఆటగాళ్లు మయాంక్ దగర్ రూ.1.8 కోట్లు, వివ్రాంత్ శర్మ రూ.2.6 కోట్లు పెట్టి పొరపాటు చేసిందనే చెప్పాలి. ఇంత మొత్తంలో మంచి ప్లేయర్ వచ్చే అవకాశం ఉంది. మొత్తం 13 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌.. 25 మంది సభ్యులతో జట్టును రూపొందించింది. సన్‌రైజర్స్ పర్స్‌లో ఇంకా రూ.6.55 కోట్లు ఉన్నాయి.


వేలం‌లో కోన్న ప్లేయర్స్: 
హరీ బ్రూక్ (13.25 కోట్లు), మయాంక్ అగర్వాల్ (రూ.8.25 కోట్లు), హెన్రీచ్ క్లాసెన్ (రూ.5.25 కోట్లు), ఆదిల్ రషీద్ (రూ.2 కోట్లు), మయాంక్ మార్కండే (రూ.50 లక్షలు), వివ్రాంత్ శర్మ (రూ.2.6 కోట్లు), సమర్థ్ వ్యాస్ (రూ.20 లక్షలు), ఉపేంద్ర సింగ్ యాదవ్ (రూ.25 లక్షలు), మయాంక్ దగర్ (రూ.1.8 కోట్లు), అకీల్ హోస్సెన్ (రూ.కోటి), నితీశ్ కుమార్ (రూ.20 లక్షలు), అన్‌మోల్ ప్రీత్ సింగ్ (రూ.20 లక్షలు). 


రిటైన్ ప్లేయర్స్:
అబ్దుల్ సమద్ (రూ.4 కోట్లు), ఉమ్రాన్ మాలిక్ (రూ.4 కోట్లు), వాషింగ్టన్ సుందర్ (రూ.8.75 కోట్లు), రాహుల్ త్రిపాఠి (రూ.8.5 కోట్లు), అభిషేక్ శర్మ (రూ.6.5 కోట్లు), కార్తీక్ త్యాగీ (రూ.4 కోట్లు), టీ నటరాజన్ (రూ.4 కోట్లు), భువనేశ్వర్ కుమార్ (రూ.4.2 కోట్లు), ఎయిడెన్ మార్క్‌రమ్ (రూ.2.6 కోట్లు), మార్కో జాన్సెన్ (రూ.4.2 కోట్లు), గ్లేన్ ఫిలిప్స్ (రూ.1.5 కోట్లు), ఫజలఖ్ ఫరూఖీ (రూ.50 లక్షలు). 


Also Read: IPL 2023 Auction: అందుకే సామ్ కరన్‌కు రూ. 18.5 కోట్లు వెచ్చించాం: పంజాబ్ కింగ్స్ సహ యజమాని  


Also Read: చెన్నై జట్టులోకి బెన్ స్టోక్స్‌.. ఇక ఎంఎస్ ధోనీ ఉంటాడా! సీఎస్‌కే సీఈఓ ఏమన్నాడంటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.