జైపూర్‌ లోని సవాయ్‌ మాన్‌ సింగ్‌ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై కోల్ కతా నైట్ రైడర్స్ అద్భుత విజయం సాధించింది. బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన  రాజస్థాన్ రాయల్స్ జట్టు 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ 18.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసి విజయం సాధించింది. బ్యాట్స్ మెన్లందరూ సమిష్ఠిగా రాణించడంతో కోల్ కతాకు ఈ విజయం సాధ్యపడింది. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించిన నితీశ్ రాణా ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ గా నిలిచాడు.


ఈ ఓటమితో సవాయ్‌ మాన్‌ సింగ్‌ మైదానంలో రాజస్థాన్  రాయల్స్ జట్టు వరుస విజయాలకు కోల్ కతా నైట్ రైడర్స్ అడ్డుకట్ట వేసినట్లయింది.  ఈ మైదానంలో వరుసగా 9 మ్యాచ్ లలో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. తాజా ఓటమితో ఆ జట్టు జైత్రయాత్రకు బ్రేక్ పడినట్లయింది.