IPL: భారత టీ20 లీగ్(IPL) ఈపేరు తెలియని వారుండరు. ప్రపంచ కప్‌ కంటే ఐపీఎల్‌కే ఎక్కువ క్రేజీ ఉందంటే అతిసయోక్తి లేదు. అంతలా పాపులారిటీ సంపాదింకుంది. తాజాగా ఐపీఎల్‌కు సంబంధించి విషయం ట్రెడింగ్‌గా మారింది. ఇటీవల టీ20 వరల్డ్ కప్ 2022కు సంబంధించిన విన్నర్స్, రన్నర్స్ ప్రైజ్ మనీని ఐసీసీ ప్రకటించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీ20 లీగ్‌లను వరల్డ్ కప్‌తో కంపేర్ చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈనేపథ్యంలో ఆసక్తికర విషయం బయట పడింది. ఇందులో బీసీసీఐ నిర్వహిస్తున్న ఐపీఎల్‌ గేమ్‌ తొలి స్థానంలో నిలిచింది. ఐపీఎల్‌లో గెలిస్తే విన్నర్‌కు రూ.20 కోట్ల ప్రైజ్ మనీని అందిస్తారు. టీ20 వరల్డ్ కప్‌లో గెలిచిన జట్టుకు రూ.13 కోట్లు మాత్రమే ఇస్తున్నారు. అంటే ఐపీఎల్‌ కంటే రూ. 7 కోట్లు తక్కువ అన్నట్లు. ఇతర లీగ్‌లను చూస్తే..సీపీఎల్ విన్నర్లకు రూ.8.14 కోట్లను అందజేస్తున్నారు. 


బీపీఎల్.. రూ.6.92 కోట్లను విన్నర్స్‌కు ఇస్తోంది. బీబీఎల్..రూ. 3.66 కోట్లను అందిస్తోంది. పీఎస్‌ఎల్‌లో  గెలిచిన టీమ్‌కు  రూ.3.40 కోట్లను అందిస్తున్నారు. చివర్లో హన్‌డ్రెడ్‌ నిలిచింది. ఇందులో గెలిచిన జట్టుకు రూ.1.3 కోట్లను ప్రైజ్‌ మనీ ఇస్తున్నారు. మొత్తంగా ఐపీఎల్ ప్రైజ్ మనీయే అధికంగా ఉంది. ఈలీగ్‌ను 2008లో మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు నిరంతరాయంగా కొనసాగుతోంది. 


ప్రతి ఏటా మెగా వేలం, మినీ వేలం నిర్వహించి..ఆటగాళ్లను ఎంపిక చేస్తున్నారు. ఇటీవల లక్నో, గుజరాత్ కొత్త జట్లు ఎంట్రీ ఇచ్చాయి. ఆరంభంలోనే గుజరాత్ జట్టు విన్నర్‌గా నిలిచింది. మొత్తం 10 జట్లు ఐపీఎల్‌లో పోటీ పడుతున్నాయి. గతేడాది వరకు 8 జట్లు మాత్రమే బరిలో ఉండేవి. ఐపీఎల్‌లో స్వదేశీ, విదేశీ ఆటగాళ్లు ఆడనున్నారు. 11 మంది సభ్యుల్లో 6 మంది స్వదేశీయులు ఆడించేందుకు అవకాశం ఉంది. 


విదేశీయులను మాత్రం ఐదుగురికి మాత్రమే చోటు కల్పించేలా నిబందనలు ఉన్నాయి. ఈమెగా టోర్నీని బీసీసీఐ నిర్వహిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎలాంటి నిబంధనలు ఉంటాయో వాటినే ఐపీఎల్‌లో అమలు చేస్తున్నారు. రాబోయే సీజన్‌లో మరిన్ని కొత్త నిబంధనలు రానున్నాయి. 


[[{"fid":"247120","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


Also read:Ayyannapatrudu: 14 కేసులు పెట్టారు..ఏం చేశారు..సీఎం జగన్‌పై అయ్యన్నపాత్రుడు ఫైర్..!  


Also read:Congress: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఆ ఇద్దరు నేతల మధ్యే పోటీ..సోనియా మద్దతు ఎవరికీ..!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి