IPL Kohli Stunning Catch: తాజా ఐపీఎల్ సీజన్‌లో బ్యాట్‌తో అంతగా రాణించలేకపోతున్న ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లి.. ఫీల్డింగ్‌లో మాత్రం అదరగొడుతున్నాడు. శనివారం (ఏప్రిల్ 16) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. ఒకరకంగా ఈ క్యాచ్ మ్యాచ్‌ను టర్న్ చేసిందని చెప్పొచ్చు. కోహ్లి క్యాచ్‌తో దూకుడుగా ఆడుతున్న రిషబ్ పంత్ పెవిలియన్ బాట పట్టాడు. దీంతో మ్యాచ్ ఆర్సీబీ వైపు టర్న్ తీసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోహ్లి క్యాచ్‌కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహమ్మద్ సిరాజ్ వేసిన 17 ఓవర్‌లో మూడో బంతికి రిషబ్ పంత్ మిడ్ వికెట్ మీదుగా బంతిని గాల్లోకి లేపుతూ గట్టి షాట్ బాదాడు. సర్కిల్ అవతల ఫీల్డింగ్‌ చేస్తున్న కోహ్లి గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో ఆ బంతిని పట్టుకున్నాడు. కోహ్లి స్టన్నింగ్ క్యాచ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కళ్లెం వేసినట్లయింది. 


అప్పటికి ఢిల్లీ గెలుపుకు 22 బంతుల్లో 48 పరుగులు అవసరం. పంత్ దూకుడు చూస్తే ఢిల్లీ లక్ష్యం దిశగా వెళ్తున్నట్లే కనిపించింది. ఇంతలో కోహ్లి స్టన్నింగ్ క్యాచ్‌తో మ్యాచ్ టర్న్ తీసుకుంది. పంత్ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించకపోవడంతో ఢిల్లీ 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అంతకుముందు, తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 189 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్  అర్ధసెంచరీ (55), చివరలో దినేశ్ కార్తీక్ (66) మెరుపులతో భారీ స్కోర్ సాధించింది.


ఆ తర్వాత బ్యాటింగ్‌కి దిగిన ఢిల్లీ జట్టులో డేవిడ్ వార్నర్ (66), రిషబ్ పంత్ (34) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్స్ చేశారు. మిగతా బ్యాట్స్‌మెన్ అంతా చేతులెత్తేయడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. 



Also Read: Rare Incident: హస్త ప్రయోగం ఎఫెక్ట్... ఊపిరితిత్తులు దెబ్బతిని ఆసుపత్రిలో చేరిన యువకుడు...   


Prabhas Fined: ఆ కారు ప్రభాస్‌ది కాదు... క్లారిటీ ఇచ్చిన రెబల్ స్టార్ పీఆర్ టీమ్...


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook