2024 T20 World Cup squad: ఐపీఎల్ లో ముంబై ఫట్.. టీమిండియా స్వ్కాడ్‌లో సూపర్ హిట్..
IPL 2024: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 17వ సీజన్ లో దారుణంగా ఆడుతున్న ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు.. టీ20 ప్రపంచకప్ స్క్వాడ్ లో మాత్రం సత్తా చాటారు. అదెలాగంటే?
India's Squad for T20 World Cup 2024: మరో నెలరోజుల్లో టీ20 ప్రపంచకప్ మెుదలుకానుంది. ఈ మెగా టోర్నీకి భారత జట్టును ఇది వరకే ప్రకటించింది బీసీసీఐ. మెుత్తం 15 మంది ఫ్లేయర్లను ఎంపిక చేసింది. మరో నలుగురిని రిజర్వ్ ఆటగాళ్లుగా పేర్కొంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ (IPL 2024)లో మొత్తం 19 మంది ఆటగాళ్లలో ఏ జట్టు నుంచి ఎంత మంది ఫ్లేయర్లు టీ20 ప్రపంచకప్ ఎంపికయ్యారో ఓసారి చూద్దాం.
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ లో మెుత్తం 10 జట్లలో ఆరు ఐపీఎల్ జట్ల నుంచి 15 మంది ఆటగాళ్లు చోటుదక్కించుకున్నారు. మిగిలిన నాలుగు టీమ్స్ లో రెండు జట్ల నుంచి ఇద్దరు ఫ్లేయర్లను రిజర్వ్ ప్లేయర్‌లుగా ఎంపికయ్యారు. మరో రెండు టీమ్స్ నుంచి అయితే ఏ ఒక్క ఆటగాడికి చోటుదక్కలేదు. ఈ లిస్ట్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ ఉన్నాయి.
ఆ జట్టు నుంచి ఏకంగా నలుగురు ..
జూన్ లో ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్ టీమిండియా స్క్వాడ్ లో అత్యధికంగా ముంబై ఆటగాళ్లు చోటుదక్కించుకున్నారు. ముంబై ఇండియన్స్ జట్టు నుంచి నలుగురు ప్లేయర్స్ కు స్థానం లభించింది. వారే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా మరియు జస్ప్రీత్ బుమ్రా. ముంబై తర్వాత రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ముగ్గురేసి ఆటగాళ్లు ఎంపికయ్యారు. రాజస్థాన్ నుంచి సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్ మరియు యుజ్వేంద్ర చాహల్ ఉండగా.. ఢిల్లీ నుంచి రిషబ్ పంత్‌తో పాటు అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్ ఫ్లేస్ దక్కించుకున్నారు.
ఇక సీఎస్కే నుంచి ఇద్దరికి, ఆర్సీబీ నుంచి ఇద్దరికీ చోటు దక్కింది. చెన్నై సూపర్ కింగ్స్ నుంచి శివమ్ దూబే, రవీంద్ర జడేజాకు, బెంగళూరు నుంచి విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్ భారత జట్టుకు ఎంపికయ్యారు. పంజాబ్ కింగ్స్ నుంచి ఒక్క ఆటగాడికి చోటు లభించింది. అతడే పేసర్ అర్ష్‌దీప్ సింగ్. కేకేఆర్ నుంచి రింకూసింగ్, గుజరాత్ టైటాన్స్ జట్టు నుంచి శుభ్‌మన్ గిల్‌లు రిజర్వు ఆటగాళ్లు సెలెక్ట్ అయ్యారు.
Also Read: 2024 T20 World Cup: ప్రపంచకప్ కు అదే ఫైనల్ టీమ్ కాదు... రాహుల్ కు కూడా ఛాన్స్ ఉంది.. ఎలాగంటే?
Also read: T20 World Cup 2024: తొలిసారి టీ20 ప్రపంచకప్ ఆడబోతున్న భారత ఫ్లేయర్లు వీళ్లే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter