BCCI fines SRH batter Heinrich Klaasen For His Comments On Umpires: ఉప్పల్‌ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై లక్నో సూపర్ జెయింట్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.  తొలుత 20 ఓవర్లలో సన్‌రైజర్స్ 182/6 స్కోరు చేసింది. హెన్రిచ్‌ క్లాసెన్‌ (47), అబ్దుల్ సమద్‌ (37 నాటౌట్‌) ఆకట్టుకున్నారు. లక్నో బౌలర్లలో కృనాల్‌ పాండ్యా (2/24) రాణించాడు. లక్ష్య ఛేదనలో లక్నో 19.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 185 రన్స్ చేసింది. ప్రేరక్‌ మన్కడ్‌ (64 నాటౌట్‌) అజేయ అర్ధ సెంచరీతో విజృంభించాడు. నికోలస్‌ పూరన్‌ (13 బంతుల్లో 44 నాటౌట్‌, 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), మార్కస్ స్టొయినిస్‌ (40) రాణించాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఫిలిప్స్‌, మార్కండే, అభిషేక్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హెన్రిచ్‌ క్లాసెన్‌కు జరిమానా పడింది. అలాగే లక్నో స్పిన్నర్ అమిత్ మిశ్రా కూడా ఐపీఎల్‌ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. క్లాసెన్‌, మిశ్రాపై 10 శాతం జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ కమిటీ పేర్కొంది. నో బాల్‌ వ్యవహారం తర్వాత థర్డ్‌ అంపైర్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేయడమే ఇందుకు ప్రధాన కారణం. క్లాసెన్‌ లెవెల్‌1 అత్రికమణకు పాల్పడ్డాడని, మ్యాచ్‌ రెఫరీదే తుది నిర్ణయమని ఐపీఎల్‌ నిర్వహకులు తెలిపారు. 


'ఐపీఎల్ కోడ్‌ ఆఫ్ కండక్ట్ అండర్ 2.7 ఆర్టికల్ లెవెల్‌ 1 నేరం కింద సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ప్లేయర్ హెన్రిచ్‌ క్లాసెన్‌కు 10 శాతం జరిమానా పడింది. బహిరంగ విమర్శలు చేయడం, అంపైర్‌ నిర్ణయంపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు విచారణలో తేలింది. లక్నో సూపర్ జెయింట్స్‌ బౌలర్‌ అమిత్ మిశ్రా కూడా ఐపీఎల్ కోడ్‌ ఆఫ్ కండక్ట్ 2.2 ఆర్టికల్‌ లెవల్ 1 ప్రకారం మ్యాచ్‌ సందర్భంగా క్రీడా పరికరాలను అవమానించినందుకు  10 శాతం జరిమానా విధించాం' అని ఐపీఎల్ కమిటీ తెలిపింది. 


ఉప్పల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్‌ సందర్భంగా 19 ఓవర్‌ ఆవేశ్‌ ఖాన్‌ వేశాడు. మూడో బంతి హైఫుల్‌ టాస్‌గా వెళ్లింది. ఫీల్డ్‌ అంపైర్‌ నోబాల్‌గా ప్రకటించాడు. లక్నో కెప్టెన్‌ అంపైర్‌ కాల్‌ను చాలెంజ్‌ చేశాడు. రిప్లే చూసిన థర్డ్‌ అంపైర్‌.. నో బాల్‌ కాదని చెప్పాడు. నడుము పై నుంచి బంతి వెళ్లినప్పటికీ థర్డ్‌ అంపైర్‌ ఫెయిర్‌ డెలివరీగా ప్రకటించడంతో క్రీజులో ఉన్న అబ్దుల్ సమద్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌ సహా సన్‌రైజర్స్ అసంస్తృప్తి వ్యక్తం చేశారు. ఆపై లెగ్‌ అంపైర్‌తో క్లాసెన్‌ వాగ్వాదానికి దిగాడు. అదే సమయంలో ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులు నట్టులు, మేకులు లక్నో డగౌట్‌పై విసిరారు. దీంతో మ్యాచ్‌ కాసేపు ఆగింది. అంపైర్‌తో వాగ్వాదానికి దిగిన క్లాసెన్‌కు జరిమానా పడింది.


Also Read: 2023 Cheapest Car in india: 5 లక్షల బడ్జెట్‌లో 4 బెస్ట్ కార్లు.. మైలేజ్ 32 కిలోమీటర్లు!


Also Read: Bajaj Avenger 220 Street: రాయల్ ఎన్‌ఫీల్డ్ మాదిరి బైక్‌ను విడుదల చేసిన బజాజ్.. సగం ధరకే అద్భుతమైన ఫీచర్లు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చే