CSK Captain MS Dhoni Heap Praise on Chennai Batter Ambati Rayudu: టీమిండియా మాజీ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ అంబటి రాయుడిపై చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రశంసల వర్షం కురిపించాడు. రాయుడు అద్భుత క్రికెటర్ అని. అతడు మైదానంలో వందశాతం శ్రమించే ఆటగాడు అని అన్నాడు. రాయుడు ఉంటే మాత్రం తాను  ఫెయిర్ ప్లే అవార్డును మాత్రం గెలవలేను అని మహీ సరదాగా అన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్‌ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ను చివరి బంతికి ఓడించి సీఎస్‌కే విజేతగా నిలిచింది. దాంతో ఐపీఎల్ టోర్నీలో ఐదు టైటిల్స్‌ గెలిచిన రెండో జట్టుగా చెన్నై అవతరించింది. ముంబైని సమం చేస్తూ రికార్డు సృష్టించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ... 'ఒక్కరూ వ్యక్తిగతంగా రాణించేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తారు. అజింక్య రహానే సహా కొంత మందికి ఎంతో అనుభవం ఉంది. ముఖ్యంగా అంబటి రాయుడు మైదానంలో వంద శాతం శ్రమిస్తాడు. కానీ అతడు ఉంటే మాత్రం నేను ఫెయిర్ ప్లే అవార్డును గెలవలేను. రాయుడు అద్భుత క్రికెటర్‌. చాలాకాలం నుంచి అతడితో కలిసి ఆడిన అనుభవం నాకు ఉంది. భారత్-ఎ జట్టు నుంచీ అతడు తెలుసు. స్పిన్‌, పేస్‌ను బాగా ఆడతాడు. ఐపీఎల్ 2023 ఫైనల్లో ఉత్తమ ప్రదర్శన చేశాడు. అద్భుతంగా కెరీర్‌ను ముగించిన రాయుడు జీవితంలోని తర్వాతి దశను సంతోషంగా గడపాలని కోరుకుంటున్నా' అని అన్నాడు. 


'నా రిటైర్‌మెంట్‌పై సమాధానం కోసం మీరు చూస్తున్నారని నాకు తెలుసు. అందుకు ప్రకటన చేయడానికి ఇది సరైన సమయమే. కానీ ఈ ఏడాది నేను ఎక్కడకు వెళ్లినా.. ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన వచ్చింది. వారి ప్రేమాభిమానాలను సొంతం చేసుకున్నా. అందుకు అందరికీ థాంక్స్‌ అని చెప్పడం చాలా సులువు. అయితే నాకు కష్టమైన విషయం ఏంటంటే మరో 9 నెలలు శ్రమించి వచ్చే సీజన్‌ ఆడాలి. నా శరీరంపై ఆధారపడి వచ్చే సీజన్ ఆడేది ఆధారపడి ఉంటుంది. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి ఇంకా 6-7 నెలల సమయం ఉంది. ఐపీఎల్ టైటిల్‌ను మా జట్టు నాకు గిఫ్ట్‌ ఇచ్చింది. నా పట్ల వారు చూపిన ప్రేమాభిమానాలకు నేను చేయాల్సిన బాధ్యతలు ఇంకా ఉన్నాయని నాకు అనిపిస్తోంది' అని ఎంఎస్ ధోనీ చెప్పాడు. 


'నా కెరీర్‌ చివరి దశకు చేరుకోవడంతో భావోద్వేగానికి గురయ్యా. ఐపీఎల్ 2023 తొలి మ్యాచ్‌ కోసం బరిలోకి దిగినప్పుడు అభిమానులు నా పేరును పలుకుతుంటే.. ఎమోషనల్‌ అయ్యా. డగౌట్‌లో ఉన్న నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడే ఈ సీజన్‌ను ఎంజాయ్‌ చేస్తూ ఆడాలనుకున్నా. తిరిగి వచ్చి మళ్లీ ఆడేందుకు చేయగలిగినదంతా చేస్తా. నన్ను, నా ఆటను చూసేందుకు వచ్చిన అభిమానులకు రుణపడి ఉంటా. నా వ్యక్తిత్వం ఎప్పటికీ మార్చుకోను. ప్రతి టైటిల్ నాకు ప్రత్యేకమే. అయితే ప్రతి మ్యాచ్‌లోనూ ఉత్కంఠ ఉండటమే ఐపీఎల్‌ స్పెషల్. దాని కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి' అని చెన్నై కెప్టెన్ చెప్పుకోచ్చాడు. 


Also Read: MS Dhoni-Jadeja: జడేజాను ఎత్తుకుని.. కంట తడిపెట్టిన ఎంఎస్ ధోనీ! వైరల్ వీడియో  


Also Read: IPL 2023: ఐపీఎల్ సీజన్ 16 విజేత చెన్నై, హోరాహోరీ పోరులో గుజరాత్‌కు తప్పని ఓటమి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK.