Chennai Super Kings Pacer Sisanda Magala Rules Out For 2 Weeks: బుధవారం రాత్రి చెపాక్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో ఓడిన మాజీ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గాయాల కారణంగా ఇప్పటికే దీపక్‌ చాహర్‌, బెన్‌ స్టోక్స్‌, సిమ్రన్‌జీత్‌ సింగ్‌, ముకేశ్‌ చౌదరీ సేవలను తాత్కాలికంగా కోల్పోయిన చెన్నై.. తాజాగా మరో ప్లేయర్ సేవలను కోల్పోయింది. దక్షిణాఫ్రికా పేసర్ సిసండ మగాలా గాయం కారణంగా రెండు వారాలు లీగ్‌కు దూరం అయ్యాడు. ఈ విషయాన్ని చెన్నై కోచ్ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ పోస్ట్‌ మ్యాచ్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో వెల్లడించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధవారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టార్‌ పేసర్‌ సిసండ మగాలా (Sisanda Magala Injury) ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడ్డాడు. బంతిని ఆపే క్రమంలో కుడి చేతి వేలికి గాయం అయింది. గాయం తీవ్రత​ అధికంగా ఉండటంతో... మగాలా మరో రెండు వారాలు ఐపీఎల్ 2023కి దూరంగా ఉంటాడని వైద్యులు సూచించారట. స్టార్ పేసర్లు అందరూ దూరమవడంతో సీఎస్‌కే పేస్‌ విభాగం బలహీనపడింది. ఇక హంగార్గేకర్‌, తుషార్‌ దేశ్‌ పాండే, ఆకాశ్‌ సింగ్‌లతో తదుపరి మ్యాచ్‌ల్లో చెన్నై నెట్టుకురావాల్సి ఉంటుంది. బెన్‌ స్టోక్స్‌ కోలుకున్నా.. అతను బౌలింగ్‌ చేయలేని పరిస్థితి.


ఇక చెన్నై కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ మోకాలి గాయంతో (CSK Captain MS Dhoni Injured) బాధపడుతున్నాడని కోచ్ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ తెలిపాడు. మహీ మోకాలి గాయంతో బాధపడుతున్నాడని, ఫీల్డ్‌లో కూడా పరుగు తీసేందుకు కాస్త ఇబ్బంది పడుతున్నాడన్నాడు. గాయం కారణంగా రెండు పరుగుల రావల్సిన సందర్భాల్లో.. కేవలం సింగిల్‌ మాత్రమే తీశాడని చెప్పాడు. ప్రస్తుతం ధోనీ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని, తర్వాతి మ్యాచ్‌కు ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది కాబట్టి అతడు కోలుకోంటాడని ఆశిస్తున్నామని ఫ్లెమింగ్‌ ధీమా వ్యక్తం చేశారు. 


Also Read: Maruti Suzuki Swift Price: కేవలం 1 లక్షకే మారుతీ సుజుకి స్విఫ్ట్.. కస్టమర్లను ఆకర్షిస్తోన్న స్పోర్టీ లుక్! 


రాజస్థాన్‌తో గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై 3 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌  నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 175 పరుగులు చేసింది. జోస్‌ బట్లర్ (52; 36 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు), దేవదత్‌ పడిక్కల్ (38; 26 బంతుల్లో 5 ఫోర్లు) రాణించారు. లక్ష్య ఛేదనలో చెన్నై నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 172 పరుగులు చేసింది.  రవీంద్ర జడేజా (25 నాటౌట్‌; 15 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), ఎంఎస్ ధోనీ (32; 17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) పరుగులు చేసినా చెన్నైకి ఓటమి తప్పలేదు. 


Also Read: Lovers Viral Video: ఈ వయసులో ఇంత కామం ఏంటి ఆంకుల్‌.. మరీ 18 ఏళ్ల యువతితో ఎలా రొమాన్స్‌ చేశాడో మీరే చూడండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.