CSK vs DC: టాస్ నెగ్గిన చెన్నై.. తెలుగు ఆటగాడికి చోటు! తుది జట్లు ఇవే
Chennai Super Kings have won the toss and have opted to bat. ఐపీఎల్ 2023లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది.
CSK vs DC IPL 2023 Live Updates: ఐపీఎల్ 2023లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఈ మ్యాచ్ మరికాసేపట్లో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మొదలు కానుంది. ఈ మ్యాచ్లో టాస్ నెగ్గిన చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దాంతో ఢిల్లీ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు మార్పులు చేశాయి. శివమ్ దూబే స్థానంలో తెలుగు ఆటగాడు అంబటి రాయుడికి చెన్నై జట్టులో చోటు దక్కింది. మరోవైపు మనీష్ పాండే స్థానంలో లలిత్ యాదవ్ ఢిల్లీ టీంలోకి వచ్చాడు.
ఇప్పటివరకు ఐపీఎల్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు 27 సార్లు ఎదురుపడ్డాయి. ఇందులో చెన్నై 17 సార్లు, ఢిల్లీ 10 మ్యాచ్‌లు గెలిచింది. ఇక ఈ సీజన్లో చెన్నై 11 మ్యాచ్‌లు ఆడి ఆరింట్లో గెలిచి.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరోవైపు ఢిల్లీ 10 మ్యాచ్‌ల్లో నాలుగింట్లో నెగ్గి చివరి స్థానంలో ఉంది. ఈ స్టేడియంలో ఇరు జట్ల గత ప్రదర్శనల్లో చెన్నైదే పైచేయిగా ఉంది. ఈ మ్యాచులో చెన్నై ఫేవరేట్ అని చెప్పొచ్చు.
తుది జట్లు ఇవే:
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే, అజింక్య రహానే, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ (కెప్టెన్/ కీపర్), శివమ్ దూబె, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, దీపక్ చహర్, తుషార్ దేశ్‌పాండే, మహీశ్ తీక్షణ.
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్, మిచెల్ మార్ష్, రిలీ రొసోవ్, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, లలిత్ యాదవ్, కుల్‌దీప్ యాదవ్, ముఖేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ.
సబ్‌స్టిట్యూట్ ప్లేయర్స్:
ఢిల్లీ క్యాపిటల్స్: ముఖేష్ కుమార్, మనీష్ పాండే, ప్రవీణ్ దూబే, అభిషేక్ పోరెల్, చేతన్ సకారియా.
చెన్నై సూపర్ కింగ్స్: మతీషా పతిరనా, సుభ్రాంశు సేనాపతి, మిచ్ సాంట్నర్, ఆకాష్ సింగ్, షేక్ రషీద్.
Also Read: Karnataka Exit Poll 2023 Live: ముగిసిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు ఇవే!
Aslo Read: Rohit Sharma Captaincy: ఐదు టైటిళ్లు గెలిచినా.. రోహిత్ శర్మ గొప్ప కెప్టెన్ మాత్రం కాదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయం