CSK Vs LSG Playing 11: టాస్ గెలిచిన లక్నో.. చెన్నైదే బ్యాటింగ్.. 1426 రోజుల తర్వాత చెపాక్ లో మ్యాచ్
CSK Vs LSG Playing 11: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మరికొద్ధిసేపట్లో చెన్నై సూపర్ కింగ్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది.
Chennai Super Kings Vs Lucknow Super Giants Playing 11 Out: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ 16లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మరికొద్ధిసేపట్లో చెన్నై సూపర్ కింగ్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో చెన్నై ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ కోసం లక్నో ఒక మార్పు చేసింది. జయదేవ్ ఉనద్కత్ స్థానంలో యశ్ ఠాకూర్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు చెన్నై ఎలాంటి మార్పులు చేయలేదు.
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే ఓటమిపాలైంది. దీంతో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ చెన్నైకి కీలకంగా మారింది. దాంతో ఈ మ్యాచులో విజయం సాదించేందుకు ధోనీ సేన చూస్తోంది. మరోవైపు ఢిల్లీపై గెల్చిన లక్నో.. మంచి ఊపులో ఉంది. ఈ మ్యాచులో గెలిచి పాయింట్స్ సాధించాలని రాహుల్ సేన చూస్తోంది. దాంతో ఇరు జట్ల మధ్య మంచి పోరు జరగనుంది.
దాదాపు 1426 రోజుల తర్వాత చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది. దాంతో సీఎస్‌కే అభిమానుల మైదానంలో సందడి చేస్తున్నారు. ‘విజిల్ కొట్టు’ కేరింతలతో మైదానంను హోరెత్తిస్తున్నారు. స్టేడియం మొత్తం పసుపు మయం అయింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత మూడు సీజన్లలో హోం గ్రౌండ్‌లో ఆడేందుకు అవకాశం లేకుండా పోయిన విషయం తెలిసిందే. ఈసారి మహమ్మారి ప్రభావం తగ్గడంతో.. ఇంటా, బయటా విధానంతో సొంత మైదానాల్లో సందడి వచ్చేసింది.
తుది జట్లు:
లక్నో సూపర్ జెయింట్స్: కైల్ మేయర్స్, లోకేష్ రాహుల్ (కెప్టెన్), దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, అవేష్ ఖాన్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్, యశ్ రవిసింగ్ ఠాకూర్.
చెన్నై సూపర్ కింగ్స్: డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, శివమ్ దూబే, ఎంఎస్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్, దీపక్ చహర్, రాజవర్ధన్ హంగర్గేకర్.
Also Read: Delhi Metro Girl Bikini: ఢిల్లీ మెట్రో ట్రైన్‌లో అరాచకం.. బికినీలో యువతులు! వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి