Csk Vs Srh Dream11 Prediction 2023: ఈ ఐపీఎల్ సీజన్‌ హోరాహోరీగా కొనసాగుతోంది. నేడు చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో చెన్నై మూడు విజయాలు సాధించగా.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. హైదరాబాద్ జట్టు 5 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించి.. మూడు ఓటములతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. చివరి మ్యాచ్‌లో చెన్నై 8 పరుగుల తేడాతో ఆర్‌సీబీని ఓడించగా.. హైదరాబాద్ 14 పరుగుల తేడాతో ముంబై చేతిలో ఓటమిని చవిచూసింది. శుక్రవారం చెన్నై ఎం.చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది. సీఎస్‌కేపై విజయం సాధించి హైదరాబాద్‌ పాయింట్ల పట్టికలో ముందుకు రావాలని చూస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎం.చిదంబరం స్టేడియం పిచ్ రిపోర్ట్:
ఈ మైదానంలో చాలా జట్లు టాస్ గెలిచిన తర్వాత ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాయి. ఈ స్టేడియం బౌలింగ్‌కి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి బౌలింగ్‌ ఎంచుకోవడం వల్ల భారీ స్కోర్‌ను పొందొచ్చు. ఈ స్టేడియం పిచ్‌పై బ్యాట్స్‌మెన్స్‌ స్పిన్నర్లతో ఆడుకోవాల్సి ఉంటుంది.  కాబట్టి టాస్ గెలిచిన మ్యాచ్‌ బౌలింగ్ ఎంచుకోవడం వల్ల తలపడబోయే టీమ్‌కు గట్టి పోటీని ఇవ్వొచ్చు. 


సన్‌రైజర్స్ పరిస్థితి మరి దారుణం:
గత మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్దగా స్కోరు చేయలేకపోయారు. ఐపీఎల్‌లో తొలి సెంచరీ సాధించిన హ్యారీ బ్రూక్ ముంబై జట్టుతో ఆడిన మ్యాచ్‌లో స్కోర్‌ చేయలేకపోయాడు. మయాంక్ అగర్వాల్ విషయానికొస్తే కేవలం 48 పరుగులు మాత్రమే చేశాడు. హెన్రీ క్లాసెన్ 36 పరుగులు తీసి ఔట్‌ అయ్యాడు. ఇక కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్, రాహుల్ త్రిపాఠి బ్యాటింగ్‌ మ్యాచ్‌పై ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. 


Also Read: Social Media Followers: ట్విట్టర్‌లో పవన్.. ఫేస్‌బుక్‌లో సీఎం జగన్ టాప్.. ఎవరికి ఎంతమంది ఫాలోవర్లు అంటే..?CSK vs SRH డ్రిమ్‌ ప్లేయింగ్ 11 టీమ్‌:


CSK ప్లేయింగ్ 11:
డెవాన్ కాన్వే, రితురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, MS ధోని (c), డ్వేన్ ప్రిటోరియస్, మథీష పతిరణ, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ సింగ్


SRH ప్లేయింగ్ 11:
మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్, ఐడెన్ మార్క్‌రామ్, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, M జన్షీన్, హెన్రీ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, మయాంక్ మార్కండే.


Also Read: Social Media Followers: ట్విట్టర్‌లో పవన్.. ఫేస్‌బుక్‌లో సీఎం జగన్ టాప్.. ఎవరికి ఎంతమంది ఫాలోవర్లు అంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook