DC Vs KKR IPL 2023 Dream11 Team Prediction: ఐపీఎల్ 2023లో భాగంగా నేడు డబుల్ బొనాంజా ఉంది. మధ్యాహ్నం 3.30 జరిగే మ్యాచ్‌లో రాాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఇక రాత్రి 7.30 జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్లు తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ, కోల్‌కతా అమితుమీ తేల్చుకోనున్నాయి. వరుస ఓటుములను ఎదుర్కొంటున్న ఢిల్లీకి ఈ మ్యాచ్ చాలా కీలకం. ఈ మ్యాచ్‌ను 'జియో సినిమా'లో ఫ్రీగా చూడొచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇంకా బోణీ కొట్టలేదు. వరుసగా 5 మ్యాచ్‌లు ఓడిపోయి ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. రేసులో నిలవాలంటే ఇక నుంచి అన్ని మ్యాచులు గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో మ్యాచ్‌లో వార్నర్‌ సేన ఏం చేస్తుందో చూడాలి. ఓపెనర్‌ పృథ్వీ షా, ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ పేలవ ఫామ్‌ ఢిల్లీకి పెద్ద సమస్యగా మారింది. కెప్టెన్‌ డేవిడ్ వార్నర్‌ పరుగులు చేస్తున్నా.. వేగంగా చేయలేకపోతున్నాడు. నోర్జ్, ముస్తాఫిజుర్‌, ముఖేశ్‌, కుల్దీప్, అక్షర్‌ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు.


మరోవైపు 5 మ్యాచ్‌ల్లో 2 విజయాలు అందుకున్న కోల్‌కతాకు సైతం ఈ మ్యాచ్ కీలకమే. ముంబై ఇండియన్స్‌పై ఓడినా వెంకటేశ్‌ అయ్యర్‌ సెంచరీ చేయడం సానుకూలాంశం. కెప్టెన్ నితీశ్‌ రాణా, రింకు సింగ్‌, ఆండ్రీ రసెల్‌తో బ్యాటింగ్‌ ఆర్డర్‌ పటిష్ఠంగా ఉంది. ఈ మ్యాచ్‌లో జేసన్‌ రాయ్‌ ఆడే అవకాశం ఉంది. బౌలింగ్‌లో యువ స్పిన్నర్‌ సుయాష్‌ శర్మ ఆకట్టుకుంటున్నాడు. శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, లాకీ ఫెర్గూసన్ మరింతగా రాణించాల్సి ఉంది. 


డ్రీమ్ 11 టీమ్:
వికెట్ కీపర్: ఎన్ జగదీశన్. 
బ్యాటర్లు: డేవిడ్ వార్నర్, నితీష్ రాణా (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, వెంకటేష్ అయ్యర్, మనీష్ పాండే. 
ఆల్ రౌండర్లు: అక్షర్ పటేల్ (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్. 
బౌలర్లు: అన్రిచ్ నోర్జ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చకరవర్తి. 


Also Read: Shraddha Das Hot Pics: వైట్ శారీలో శ్రద్ధా దాస్.. అదిరే ఒంపుసొంపులతో హాట్ ట్రీట్ ఇచ్చేసింది!


Also Read: Rakul Preet Singh Hot Pics: రెడ్ డ్రెస్‌లో రకుల్ ప్రీత్ సింగ్ రచ్చ.. లోదుస్తులు లేకుండా హాట్ స్టిల్స్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.