Delhi Capitals Player Misbehaves With a Woman in Party after Sunrisers Hyderabad Victory in IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ పూటుగా మద్యం సేవించి ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం తెలుస్తోంది. హైదరాబాద్ వేదికగా మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలిచిన అనంతరం ఢిల్లీ ఫ్రాంచైజీ ఏర్పాటు చేసిన పార్టీలో ఆ జట్టుకు చెందిన స్టార్ ప్లేయర్ అక్కడికి వచ్చిన ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడట. ఈ విషయాన్ని ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓ స్టార్ ప్లేయర్ మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంచైజీ షాక్‌కు గురైంది. ఈ ఘటనతో ఆటగాళ్ల విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ కఠినమైన ప్రవర్తనా నియమావళిని అమలు చేసినట్టు తెలుస్తోంది. ఏ గెస్ట్‌ అయినా సరే ఫ్రాంచైజీ అధికారుల అనుమతి లేకుండా ఆటగాళ్ల రూమ్స్‌కు వెళ్లకూడదనే రూల్స్ తీసుకొచ్చిందట. ఇది మాత్రమే కాదు మరోకొన్ని నిబంధనలను ఆటగాళ్లకు పెట్టినట్లు సమాచారం. ఢిల్లీ ఫ్రాంచైజీ పరువు, ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండేందుకు ఈ ఆంక్షలు విధించిందట.


ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంచైజీ పెట్టిన రూల్స్ ప్రకారం రాత్రి 10 గంటల తర్వాత బయటి వ్యక్తులు ఎవరూ ఆటగాళ్ల గదుల్లోకి వెళ్ళకూడదు. ఏ ఆటగాడు అయినా సరే టీమ్ హోటల్‌ నుంచి బయటికి వెళ్లాలంటే.. ఫ్రాంచైజీ అధికారుల అనుమతి తప్పనిసరి. ప్రాంచైజీ అధికారుల కనుసన్నల్లో ప్లేయర్స్ ఉండాలి. ఇక ప్లేయర్స్ సతీమణులు, ప్రియురాళ్లకు హోటల్‌లోకి అనుమతి ఉంది. అయితే వారి ఖర్చులను మాత్రం ఆటగాళ్లే భరించాలి. కుటుంబ సభ్యులు తమతోనే ఉండాలంటే.. ఫ్రాంచైజీ అధికారుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలి. ప్లేయర్స్ అందరూ ఖచ్చితంగా ఢిల్లీ ఫ్రాంచైజీ ఏర్పాటు చేసే కార్యక్రమాలకు హాజరవ్వాలి. ఏ నిబంధనను ఉల్లంఘించినా ఆటగాళ్లపై కఠిన చర్యలు ఉంటాయట. 


ఐపీఎల్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ దారుణంగా విఫలమైంది. ఐపీఎల్ 16వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండింటిలో మాత్రమే గెలిచింది. దాంతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ దిగువన ఉంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగిలిన 7 మ్యాచ్‌ల్లో కనీసం 6 గెలవాలి. అదే సమయంలో రన్ రేట్ కూడా మెరుగ్గా ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుత ఫామ్ చూస్తే మాత్రం ఢిల్లీ కనీసం 5 మ్యాచులు కూడా గెలిచే పరిస్థితి లేదు. దాంతో ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఢిల్లీ ఈ సీజన్‌లో ఐదు వరుస ఓటములను ఎదుర్కొంది. ఇక బెంగళూరు నుంచి ఢిల్లీకి ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమంది ఆటగాళ్ల కిట్ బ్యాగ్‌లు కూడా పోయాయి. అవి దొరకడానికి కొన్ని రోజులు పట్టింది.


Also Read: Revanth Reddy Govt Jobs: కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు: రేవంత్ రెడ్డి


Also Read: Washington Sundar IPL 2023: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు భారీ షాక్‌.. ఐపీఎల్ 2023 మొత్తానికి స్టార్‌ ఆటగాడు దూరం!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.