IPL Updates: చెన్నైపై 14 పరుగులకే 6 వికెట్లు తీశా.. ఐపీఎల్‌లో మరుపురాని క్షణం అదే: పాక్ మాజీ పేసర్
Sohail Tanvir on IPL: ఐపీఎల్‌లో ఒకే సీజన్‌లో పాల్గొన్నారు పాక్ ఆటగాళ్లు. ముంబైలో 26/11 దాడి తరువాత పాకిస్థాన్‌తో దైపాక్షిక సిరీస్‌లతో పాటు ఆ దేశ ఆటగాళ్లను ఐపీఎల్‌లో పాల్గొనకుండా నిషేధం విధించారు. ఆడిన ఒక సీజన్లోనే పాక్ బౌలర్ సోహైల్ తన్వీర్ తన సూపర్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు.
Sohail Tanvir on IPL: ఐపీఎల్‌కు సంబంధించి తన బెస్ట్ మెమరీని గుర్తుచేసుకున్నాడు పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ సోహైల్ తన్వీర్. ఐపీఎల్ 2008లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 పరుగులకు 6 వికెట్లు పడగొట్టడం తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఐపీఎల్ క్షణంగా అభివర్ణించాడు. ఐపీఎల్ తొలి సీజన్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్ తరువాత ముంబైలో 26/11 దాడి తరువాత పాక్ ఆటగాళ్లను ఐపీఎల్‌లో పాల్గొనకుండా నిషేధించారు. అప్పటి నుంచి ఈ మెగా టోర్నీలో పాక్ ఆటగాళ్లకు ప్రవేశం లేదు.
సోహైల్ తన్వీర్ ఐపీఎల్ 2008లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ తొలి సీజన్‌లో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలో రాజస్థాన్ రాయల్స్.. షేన్ వార్న్ కెప్టెన్సీలో టైటిల్ గెలుచుకుంది. ఆ సీజన్‌లో సోహైల్ తన్వీర్ రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2008లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 'స్పోర్ట్స్ యారీ'లో సోహైల్ తన్వీర్‌ని ఈ ఐపీఎల్ సీజన్‌లో అత్యుత్తమ తీపి గుర్తును అడిగినప్పుడు.. తన్వీర్ వివరంగా సమాధానం ఇచ్చాడు.
'చెన్నై జట్టుపై 14 పరుగులకు 6 వికెట్లు తీయడం నాకు ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. ఇది చాలా సీజన్ల వరకు రికార్డుగా మిగిలిపోయింది. ఇది మరపురాని ప్రదర్శన. ఈ రోజు కూడా నేను భారత క్రికెట్ అభిమానులను కలిసినప్పుడు వారు ఐపీఎల్ గురించి మాట్లాడతారు. వారు కూడా ఆ స్పెల్ గురించి ప్రస్తావించారు. ఆ స్పెల్ నాకు చిరకాలం గుర్తుండిపోయింది..' అని తన్వీర్ చెప్పుకొచ్చాడు.
తన్వీర్ అద్భుతమైన ప్రదర్శనతో చెన్నై జట్టు కేవలం 109 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సోహైల్ తన్వీర్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఓవర్‌లోనే పార్థివ్ పటేల్, స్టీఫెన్ ఫ్లెమింగ్‌లను సోహైల్ పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే శివరామకృష్ణన్‌ను అవుట్ చేశాడు. తన రెండో స్పెల్‌లో అల్బీ మోర్కెల్, ముత్తయ్య మురళీధరన్, మఖాయలను ఔట్ చేసి ఐపీఎల్‌లో సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు.
2019లో తన్వీర్ రికార్డు బద్దలు అయింది. ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వెస్టిండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ 3.4 ఓవర్లలో కేవలం 12 పరుగులు ఇచ్చి ఆరు వికెట్ల తీశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఈ రికార్డును నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 137 పరుగులకే పరిమితమైంది. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో జోసెఫ్ సూపర్ బౌలింగ్‌తో ముంబైను గెలిపించాడు. హైదరాబాద్ 17.4 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలి ఓటమి పాలైంది.
Also Read: 7th Pay Commission: ఉద్యోగుల జీతం పెంపు.. ఇన్‌కమ్ ట్యాక్స్ తగ్గింపు.. పార్లమెంట్‌లో కేంద్రం వివరణ
Also Read: MLC Kavitha: వరుసగా ఫోన్లను మార్చిన ఎమ్మెల్సీ కవిత.. రహాస్య వ్యవహారాల కోసమేనా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook