GT vs CSK Head to Head: గుజరాత్, చెన్నై మధ్య తొలి క్వాలిఫయర్.. హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!
IPL 2023 Qualifier 1 CSK vs GT Head To Head Records. ఐపీఎల్ 2023 తొలి క్వాలిఫయర్‌లో పాయింట్స్ టేబుల్ టాపర్స్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి.
GT vs CSK IPL 2023 Qualifier 1 Head To Head Records: ఐపీఎల్ 2023 లీగ్ దశ ఉత్కంఠంగా ముగిసింది. చివరి మ్యాచ్ వరకు ప్లేఆఫ్స్ బెర్తులు ఖరారు కాలేదు. ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు మంగళవారం (మే 23) నుంచి ప్రారంభమవుతాయి. తొలి క్వాలిఫయర్‌లో పాయింట్స్ టేబుల్ టాపర్స్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. చెన్నైలోని చెపాక్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7 గంటలకు టాస్ పడనుండగా.. 7.30కు మ్యాచ్ ఆరంభం అవుతుంది. ఈ మ్యాచ్ గెలిస్తే వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగాఉన్నాయి. ఓడిన జట్టుకు క్వాలిఫయర్ 2 రూపంలో ఇంకో చాన్స్ ఉంటుంది.
క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు గెలుపు అంత సులువేం కాదు. టాప్ ప్లేయర్స్ ఉండడం, రెండు టీమ్స్ వరుస విజయాలతో దూసుకెళుతుండడంతో విజయం ఎవరిని వరిస్తుందో చెప్పడం కాస్త కష్టమే అని చెప్పాలి. అయితే ఐపీఎల్ 2023లో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌లో చెన్నైపై గుజరాత్ విజయం సాధించింది. అయితే సొంతమైదానం కావడంతో చెన్నై విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు ఎప్పుడూ తలపడలేదు. కానీ ఆతిథ్య చెన్నైకి వారి సొంత వేదికపై ఆడిన అనుభవం చాలా ఉంది. చిదంబరం స్టేడియంలో చెన్నైకి మొత్తంగా గొప్ప రికార్డుఉంది. కానీ ఈ సీజన్ గణాంకాలు మాత్రం అంత గొప్పగా లేవు.ఇరు జట్ల మధ్య అత్యధిక స్కోర్ 182 కాగా.. అత్యల్ప స్కోర్ 133. ఇక చెన్నైలో మొత్తంగా 74 మ్యాచులు జరగ్గా.. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు 44 సార్లు గెలిచింది. ఈ మైదానంలో చేసింగ్ చేసిన జట్టు 30 సార్లు గెలిచింది. చిదంబరం స్టేడియంలో అత్యధిక స్కోర్ 246/5 కాగా.. అత్యల్ప స్కోర్ 70.
చిదంబరం స్టేడియంలో చెన్నై రికార్డ్:
చెన్నై ఆడింది: 63
చెన్నై గెలిచింది: 44
చెన్నై ఓడిపోయింది: 18
టై అయిన మ్యాచ్: 1 (సూపర్ ఓవర్ గెలిచింది)
చెన్నై మొదట బ్యాటింగ్ చేసి గెలిచింది: 27
చెన్నై చేజింగ్ చేసి గెలిచింది: 17 (సూపర్ ఓవర్‌తో సహా)
చెన్నై అత్యధిక స్కోర్: 246
చెన్నై అత్యల్ప స్కోర్: 109
Also Read: Second Hand Car Benfits: సెకండ్ హ్యాండ్ కారు కొనడం వల్ల కలిగే ఈ 4 ప్రయోజనాలు మీకు తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.