Will Rain Play Spoilsport Gujarat Titans vs Chennai Super Kings Match 1 in Ahmedabad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ మరో కొన్ని గంటల్లో ఆరంభం కానుంది. డిపెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య క్యాష్ రిచ్ లీగ్ మొదటి మ్యాచ్‌ జరగనుంది. నరేంద్ర మోదీ స్టేడియంలో నేటి రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. నేడు ఐపీఎల్ 2023 ప్రారంభోత్సవ వేడుకలు ఉన్న నేపథ్యంలో మ్యాచ్ ఆరంభానికి కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఎప్పుడెప్పుడా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు ఒక బ్యాడ్‌న్యూస్‌. ఈ సీజన్ తొలి మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌కు వర్షం ముప్పు (GT vs CSK IPL 2023 Weather Update) పొంచి ఉందని అహ్మదాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. అహ్మదాబాద్‌లో గురువారం భారీ వర్షం కురిసింది. ఉన్నపళంగా వాతావరణం మారిపోయి భారీ వర్షం పడింది. దాంతో చెన్నై, గుజరాత్ జట్ల ప్రాక్టీస్ సెషన్‌లు రద్దు అయ్యాయి. ఉరుములు, మెరుపులతో వర్షం కురవడంతో మైదానం నీరుతో నిండిపోయింది. అయితే మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఉండడంతో పిచ్ త్వరగానే సిద్ధమైంది. 


శుక్రవారం (మార్చి 31) ఉదయం నుంచి అహ్మదాబాద్‌లో వర్షం పడలేదు. ప్రస్తుతం ఎండ బాగానే కాస్తోంది. అయితే శుక్రవారం వర్షం పడే అవకాశాలు చాలా తక్కువ అని, ఒకవేళ పడినా చిరుజల్లులు మాత్రమే కురిసే అవకాశం ఉందని అహ్మదాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. గత కొన్నిరోజులుగా దేశ వ్యాప్తంగా ఉన్నట్టుండి వాతావరం మారిపోయి వర్షం పడుతోంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. అహ్మదాబాద్‌లో సాయంత్రానికి కల్లా పరిస్థితి మారితే మ్యాచ్ సజావుగా జరగడం కష్టమే. 


నరేంద్ర మోడీ స్టేడియంలోని పిచ్ బ్యాటర్లకు సహకరించనుంది. గత సీజన్‌లో ఈ వేదికపై గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఫైనల్‌ జరిగింది. మరో మ్యాచ్ కూడా జరిగింది. ఈ వేదికపై గతంలో జరిగిన టీ20 మ్యాచ్‌లను పరిశీలిస్తే.. ఛేజింగ్ జట్టు పైచేయి సాధించింది. దీంతో టాస్‌ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకునే అవకాశం ఉంది. ఇక  ఐపీఎల్ 2023 మ్యాచులు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం కానున్నాయి. మొబైల్లో చూడాలనుకునే వారు జియో సినిమా యాప్, వెబ్‌సైట్‌లో (IPL on Jio Cinema) చూడొచ్చు.


Also Read: IPL 2023 Winnner: ఐపీఎల్‌ 2023 టైటిల్ గెలిచేది ఆ జట్టే.. మాజీ దిగ్గజం జోస్యం!  


Also Read: MS Dhoni Injury: ఐపీఎల్ తొలి మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ దూరం.. క్లారిటీ ఇచ్చిన సీఎస్‌కే సీఈవో!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.