Gt Vs Mi Dream11 Prediction Today Match: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ రోజు అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ రాత్రి 7:30 గంటలకు జరుగనుంది. ఈ సీజన్‌లో ఇప్పటికీ ముంబై ఆరు  మ్యాచ్‌లు ఆడగా మూడు మ్యాచ్‌లు గెలిచింది. మరో మూడు మ్యాచ్‌లు ఓటమి పాలయ్యింది. ఇక గుజరాత్ విషయానికొస్తే.. ఇప్పటికీ 6 మ్యాచ్‌లు ఆడగా, అందులో 4 మ్యాచ్‌లు గెలిచి ఐపీఎల్‌ పైన్ట్స్‌ టెబుల్‌లో నాలుగవ స్థానంలో నిలిచింది. ఇక ఈ రోజు జరగబోయే మ్యాచ్‌ రసవత్తరంగా కొనసాగనుంది. అయితే ఈ రోజు జరిగే గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్‌కు సంబంధించిన డ్రిమ్‌ 11 ప్రిడిక్షన్ గురించి తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డ్రీమ్‌ 11 ఫాంటసీ టీమ్ ప్రిడిక్షన్ తెలుసుకోవడానికి ముందుగా పిచ్ రిపోర్ట్, వాతావరణ సూచన తెలుసుకోవాల్సి ఉంటుంది. మ్యాచ్‌కు సంబంధించిన వివరాలు హెడ్ టు హెడ్ రికార్డ్‌లను పొందాలనుకుంటే ఈ స్టోరీ పూర్తిగా చదవాల్సిందే. 


నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ రిపోర్ట్:
టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్‌ చేస్తే..జట్లు స్వేచ్ఛగా పరుగులు తీయోచ్చు. అంతేకాకుండా ఈ పిచ్‌లో 180 కంటే ఎక్కువ స్కోర్ చేయోచ్చు.
మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సగటు స్కోర్‌ 188 పరుగులు తీసిన టీమ్‌, రెండవ ఇన్నింగ్స్‌లో 152 పరుగులు చేసిన టీమ్‌తో పోలిస్తే..మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది.
ఈ స్టేడియంలో నాలుగు వికెట్లు తీసిన హార్దిక్ పాండ్యా  మంచి రికార్డు సంపాదించుకున్నాడు. 
ఈ స్టేడియంలో న్యూజిలాండ్‌పై శుభ్‌మన్ గిల్ 63 బంతుల్లో 126 పరుగులు చేశాడు.  
స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లు, బ్యాట్స్‌మెన్స్‌కి ఈ పిచ్‌ అనుకూలంగా ఉంటుంది. 


వాతావరణం:
ఈ రోజు వాతావరణం ఆటకు అనుకూలంగా ఉంది. తేమ పొడిగా ఉండడం వల్ల ఉష్ణోగ్రత సాధారణంగానే ఉండబోతోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం అంత తేమ కనిపించదు.


Also Read: Virupaksha Collections : బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో విరూపాక్ష.. దుమ్ములేపేస్తోన్న మెగా హీరో


మ్యాచ్ ప్లేయింగ్ 11:
MI ప్లేయింగ్ 11: 

రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్, జోఫ్రా ఆర్చర్, పీయూష్ చావ్లా, హృతిక్ షోకీన్, జాసన్ బెహ్రిండోర్ఫ్, అర్జున్ టెండూల్కర్,నెహాల్ బథేరా.


GT ప్లేయింగ్ 11:
శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, హార్దిక్ పాండ్యా, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, విజయ్ శంకర్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, దాసున్ షనకా.


డ్రీమ్ 11 అంచనా:
వికెట్ కీపర్: 

ఇషాన్ కిషన్, వృద్ధిమాన్ ఇద్దరూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు.  వారు ఓపెనింగ్‌కు వస్తే పవర్‌ప్లేను వినియోగించుకోవచ్చు. వృద్ధిమాన్ సాహా 6 మ్యాచ్‌ల్లో 137 పరుగులు చేయగా..ఇషాన్ కిషన్ ముంబై ఇండియన్స్ (MI) తరఫున 4 ఇన్నింగ్స్‌ల్లో 30పైగా పరుగులు చేశాడు.


బ్యాటర్లు: 
శుభ్‌మన్ గిల్, కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టీమ్ డేవిడ్, టీమ్ డేవిడ్ ఈ సీజన్‌లో రాణిస్తున్నారు. కామెరాన్ గ్రీన్ కూడా బౌలింగ్ చేస్తే మంచి పాయింట్లు పొందొచ్చు. 


బౌలింగ్: 
మహ్మద్ షమీ, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, జాసన్ బెహ్రెండార్ఫ్, జోఫ్రా ఆర్చర్, పీయూష్ చావ్లా ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నారు. వీరు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తున్నారు.


Also Read: Virupaksha Collections : బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో విరూపాక్ష.. దుమ్ములేపేస్తోన్న మెగా హీరో



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook