GT vs MI IPL 2023 Qualifier 2 Live Score Updates: ఐపీఎల్ 2023లో క్వాలిఫయర్‌ 2 మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మరికొద్దిసేపట్లో  డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం ముంబై ఒక్క మార్పు చేసింది. షోకిన్ స్థానంలో కుమార్ కార్తికేయ జట్టులోకి వచ్చాడు. మరోవైపు గుజరాత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెప్పాడు. షనక మరియు నల్కండే స్థానాల్లో జోష్ లిటిల్ మరియు సాయి సుదర్శన్ వచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ ఐపీఎల్ 2023 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడనుంది. ఓడిన జట్టు మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. దాంతో విజయం కోసమే ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. వర్షం కారణంగా టాస్‌ ఆలస్యమైంది. మ్యాచ్‌ సాధారణ సమయం కంటే అరగంట ఆలస్యంగా ప్రారంభం అయింది. షెడ్యూల్‌ ప్రకారం 7 గంటలకు టాస్‌.. 7.30 గంటలకు ఆట ప్రారంభం కావాలి. కానీ వరణుడి కారణంగా టాస్‌ 7.45 గంటలకు.. ఆట 8 గంటలకు మొదలు అయింది.


తుది జట్లు:
ముంబై ఇండియన్స్: ఇషాన్‌ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ (కెప్టెన్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్‌ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, క్రిస్‌ జొర్డాన్, పీయూశ్‌ చావ్లా, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, కుమార్ కార్తికేయ, ఆకాశ్ మధ్వాల్. 
గుజరాత్ టైటాన్స్‌: వృద్ధిమాన్‌ సాహా (వికెట్ కీపర్), శుభ్‌మన్‌ గిల్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, హార్దిక్‌ పాండ్య (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మొహ్మద్ షమీ.
 
ఇంపాక్ట్‌ ప్లేయర్లు:
గుజరాత్: జాషువా లిటిల్‌, శ్రీకర్ భరత్, ఓడియన్‌ స్మిత్, రవిశ్రీనివాసన్‌ సాయి కిశోర్‌, శివమ్‌ మావి
ముంబై: రమణ్‌దీప్‌ సింగ్, విష్ణు వినోద్, నెహాల్ వధెరా, సందీప్ వారియర్, రాఘవ్‌ గోయల్


Also Read: Manjusha Rampalli Hot Pics: పల్చటి చీరలో మంజూష.. నాభి అందాలతో రచ్చ చేస్తున్న హాట్ యాంకర్!  


Also Read: Nothing Phone 2 Launch: నథింగ్‌ నుంచి మరో సూపర్ స్మార్ట్‌ఫోన్‌.. ఆకర్షణీయమైన డిజైన్‌, బలమైన బ్యాటరీ!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook.