ICC ODI World Cup 2023 Schedule: ఈ ఏడాది భారత్ గడ్డపై జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు సమయం దగ్గరపడుతోంది. ఈ మెగా టోర్నీ మ్యాచ్‌లకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే రూపొందించినట్లు సమాచారం. ఐపీఎల్ 2023 ముగిసిన తర్వాత (మే 28) 2023 వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఓ స్పోర్ట్స్ ఛానెల్ కథనం ప్రకారం... 2023 అక్టోబర్ 5న వన్డే ప్రపంచకప్‌ తెరలేవనుంది. మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. నరేంద్రమోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇక నవంబర్ 18న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వన్డే ప్రపంచకప్‌ 2023లో భారత్ తమ తొలి మ్యాచ్‌‌ను ఐదు సార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాతో (ODI World Cup 2023 India Schedule) తలపడనుంది. ఈ మ్యాచ్  చెన్నైలోని చెపాక్ మైదానంలో జరగనుంది. ఇక అక్టోబర్ 15న పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. వన్డే ప్రపంచకప్ కోసం భారత్ వచ్చేందుకు పాకిస్థాన్ ఒప్పుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఆసియా కప్ 2023 నిర్వహణపై సందిగ్థ ఉన్నా.. గ్లోబల్ టోర్నమెంట్‌లో ఆడేందుకు పీసీబీ ఛైర్మన్ నజామ్ సేథీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే పలు నివేదికల ప్రకారం.. ఒకవేళ పాకిస్తాన్ ఫైనల్‌కు చేరితే నరేంద్ర మోదీ స్టేడియంలోనే మ్యాచ్ ఆడుతామని పీసీబీ కండిషన్ పెట్టిందట.


అక్టోబర్ 5 నుంచి నవంబర్ 18 వరకు వన్డే ప్రపంచకప్‌ 2023 భారత గడ్డపై జరగనుంది. ఈ మెగా ఈవెంట్ కోసం అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు, ధర్మశాల, ముంబై, మొహాలీ, రాజ్‌కోట్, గౌహతి, రాయ్‌పూర్, హైదరాబాద్ వేదికలను షార్ట్‌లిస్ట్ చేసింది. ఐపీఎల్ ముగిసిన తర్వాత దీనిపై అధికారిక ప్రకటన బీసీసీఐ నుంచి వెలువడనుంది. వన్డే ప్రపంచకప్‌ 2023లో మొత్తం 10 జట్లు పోటీపడనున్నాయి. 10 టీమ్స్ మధ్య  48 మ్యాచ్‌లు జరగనున్నాయి.  8 జట్లు ఇప్పటికే మెగా టోర్నీకి అర్హత (World Cup 2023 Qualify Teams) సాధించాయి. ఈ జాబితాలో బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ కూడా ఉన్నాయి. వెస్టిండీస్, శ్రీలంక జట్లు క్వాలిఫయర్స్ ఆడి అర్హత సాదించాలి. 


క్వాలిఫై టీమ్స్:
భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్
క్వాలిఫయర్స్ ఆడే టీమ్స్:
వెస్టిండీస్, శ్రీలంక, నేపాల్, యూఏఈ, ఐర్లాండ్, జింబాబ్వే, నెదర్లాండ్స్, ఓమన్, స్కాంట్లాండ్. 


Also Read: Karnataka Exit Poll 2023 Live: ముగిసిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు ఇవే!  


Also Read: CSK vs DC: టాస్‌ నెగ్గిన చెన్నై.. తెలుగు ఆటగాడికి చోటు! తుది జట్లు ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.