GT vs RR Today Dream 11 Team: ఐపీఎల్లో నేడు బిగ్‌ఫైట్.. గుజరాత్ Vs రాజస్థాన్ డ్రీమ్ 11 టీమ్ ఇదే..
Gujarat Titans vs Rajasthan Royals Dream 11 Team Tips: ఐపీఎల్ 2023లో భాగంగా గతేడాది ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, రన్నరప్ రాజస్థాన్ రాయల్స్ జట్లు ఆదివారం తలపడుతున్నాయి. రెండు జట్లు పటిష్టంగా ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ మీ కోసం..
Gujarat Titans vs Rajasthan Royals Dream 11 Team Tips: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం బిగ్‌ఫైట్ జరగబోతుంది. ఐపీఎల్ 2023లో 23వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్-రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో గెలిచిన రాజస్థాన్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో ఉంది. చివరి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి జోరు మీద ఉంది. గుజరాత్ టైటాన్స్ కూడా నాలుగు మ్యాచ్‌ల్లో మూడు గెలిచి.. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. చివరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి జోష్‌లో ఉంది. గతేడాది ఫైనల్‌లో ఇదే స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడగా.. గుజరాత్ జట్టు విజయం సాధించి ట్రోఫీని గెలుచుకుంది. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని రాజస్థాన్ భావిస్తోంది. దీంతో రెండు జట్ల మధ్య టఫ్ వార్ ఉండనుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ బ్యాట్స్‌మెన్లకు ఎక్కువగా సహకరిస్తుంది. ప్రారంభంలో బౌన్స్‌తో పేసర్లు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. క్విక్ ఔట్ ఫీల్డ్ కారణంగా బౌండరీలు సులభంగా వెళతాయి.గత ఐదు టీ20 మ్యాచ్‌ల్లో తొలి ఇన్నింగ్స్ స్కోరు 181 పరుగులుగా ఉంది. మరోసారి హైస్కోరింగ్ గేమ్‌గా మారే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. 80 శాతం ఛేజింగ్ చేసిన జట్లదే గెలుపు ఇక్కడ. ఇప్పటివరకు రెండు జట్లు మూడు మ్యాచ్‌ల్లో తలపడగా.. మూడు మ్యాచ్‌ల్లోనూ గుజరాత్ టైటాన్స్ జట్టే విజయం సాధించింది.
గుజరాత్ టైటాన్స్ జట్టు విషయానికి వస్తే.. అన్ని రంగాల్లో పటిష్టంగా మారింది. వృద్ధిమాన్ సాహా మెరుపు ఆరంభాలు ఇస్తుండగా.. శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ భారీ స్కోర్లుగా మలుస్తున్నారు. మిడిల్ ఆర్డర్‌లో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా బ్యాట్‌తో పుంజుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా జట్టుకు అవసరమైన సందర్భంలో తమవంతు పాత్ర పోషించేందుకు రెడీగా ఉన్నారు. బౌలింగ్‌లో కూడా గుజరాత్‌కు పెద్దగా ఇబ్బంది లేదు. రషీద్ ఖాన్ ఓ ఎండ్‌లో చెలరేగుతుండగా.. అల్జారీ జోసెఫ్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ, జాషువా లిటిల్ ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు.
అటు రాజస్థాన్ రాయల్స్ కూడా గుజరాత్‌కు ఏమాత్రం తక్కువలేదు. ఓపెనర్లు జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్ భీకర ఫామ్‌లో ఉన్నారు. వీరిద్దరు 6 ఓవర్లు క్రీజ్‌లో ఉంటే.. విధ్వంసమే. దేవదత్ పడిక్కల్ కూడా ఫామ్‌లోకి రావడం కలిసి వచ్చే అంశం. కెప్టెన్ సంజూ శాంసన్ కూడా మళ్లీ బ్యాట్‌కు పనిచెప్పాల్సిన అవసరం ఉంది. మిడిల్ ఆర్డర్‌లో షిమ్రాన్ హిట్‌మేయర్, రవిచంద్రన్ అశ్విన్, ధ్రువ్ జురెల్, జేసన్ హోల్డర్ వంటి ప్లేయర్లతో పటిష్టంగా ఉంది. బౌలింగ్‌లో యుజ్వేంద్ర చాహల్‌తో గుజరాత్‌కు ముప్పుపొంచి ఉంది. సందీప్ శర్మ, ఆడమ్ జంపా, కుల్దీప్ సేన్ కూడా కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది.
రెండు జట్ల ప్లేయింగ్ 11 ఇలా.. (అంచనా)
గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ, జాషువా లిటిల్
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్‌మేయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జేసన్ హోల్డర్, కుల్దీప్ సేన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్.
డ్రీమ్ 11 టీమ్ (GT vs RR Dream11): వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, రవిచంద్రన్ అశ్విన్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్ (వైస్ కెప్టెన్), మహ్మద్ షమీ, యుజ్వేంద్ర చాహల్.
Also Read: IPL Records: ఐపీఎల్ చరిత్రలో అత్యంత చెత్త ఓవర్లు ఇవే.. ఆ ముగ్గురు బౌలర్లు ఎవరంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook