Virat Kohli IPL 2023: గుజరాత్‌పై విరాట్ కోహ్లీ శతకం.. ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన అనుష్క శర్మ.. వీడియో వైరల్
Anushka Sharma Blows Kisses To Virat Kohli: గుజరాత్ టైటాన్స్‌పై విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటంతో ఆకట్టుకున్నాడు. గుజరాత్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ.. శతక్కొట్టాడు. విరాట్ కోహ్లీ సెంచరీ తరువాత డగౌట్ నుంచి అనుష్క శర్మ ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Anushka Sharma Blows Kisses To Virat Kohli: ఈ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు పోరాటం లీగ్ దశలోనే ముగిసినా.. ఆ జట్టు పోరాటం ఆకట్టుకుంది. ముఖ్యంగా కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్ తమ ఆటతీరుతో ఆకట్టుకున్నారు. మిగిలిన ప్లేయర్ల నుంచి ఏ మాత్రం సహకారం లభించకపోవడంతోనే ఆర్‌సీబీ కొన్ని మ్యాచ్‌లను చేజేతులా ఓడిపోయింది. ఈ సాలా కప్ నమ్దే.. అంటూ మరో ఏడాది కోసం అభిమానులు నిరీక్షణ మొదలైంది. విరాట్ కోహ్లీ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో అలరించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు (7) చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన విరాట్ కోహ్లీ 61 బంతుల్లో 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీకి వరుసగా రెండో మ్యాచ్‌లో సెంచరీ. అంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విరాట్ కోహ్లీ శతకం బాదాడు. గుజరాత్‌పై శతకం బాదిన అనంతరం విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ సంబురాలు చేసుకున్నారు. డగౌట్ నుంచి కోహ్లీకి ఫ్లైయింగ్ కిస్‌లు ఇచ్చింది. విరాట్ కోహ్లీకి అనుష్క శర్మ ఫ్లయింగ్ కిస్ ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై క్రికెట్ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. సొంతగడ్డపై మొదట బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆర్‌సీబీకి మంచి శుభారంభం లభించింది. ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ తొలి వికెట్‌కు 7.1 ఓవర్లలో 67 పరుగులు జోడించారు. అయితే ఆ తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మెన్‌లు పెవిలియన్‌కు క్యూకట్టారు. గ్లెన్ మాక్స్ వెల్, దినేష్ కార్తీక్, మహిపాల్ లోమ్రోర్ నిరాశపరిచారు.
మైఖేల్ బ్రేస్‌వెల్ 16 బంతుల్లో 26 పరుగులు చేయగా.. అనూజ్ రావత్ 15 బంతుల్లో 23 పరుగులతో చివర్లో మెరుపు మెరిపించాడు. 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 197 రన్స్ చేసింది. అనంతరం గుజరాత్ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (104, 52 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు) శతకంలో చెలరేగాడు.
Also Read: IPL 2023 Playoffs: ప్లే ఆఫ్స్ చేరిన నాలుగు జట్లు.. ఎవరితో ఎవరు ఢీ అంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి