Chennai Super Kings vs Rajasthan Royals Playing 11: ఐపీఎల్‌ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు. చెన్నై రెండు మార్పులతో బరిలోకి దిగింది. మహీశ్ తీక్షణ, మొయిన్ అలీ జట్టులోకి వచ్చారు. మరోవైపు రాజస్థాన్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. గాయం కారణంగా బౌల్ట్ ఈ మ్యాచుకు దూరమయ్యాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2023లో చెన్నై, రాజస్థాన్ జట్లు ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో చెరో రెండిటిలో విజయం సాధించాయి. అయితే రన్ రేట్ కారణంగా పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రెండో స్థానంలో ఉండగా.. చెన్నై ఐదో స్థానంలో ఉంది. చెపాక్‌ స్టేడియం సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలం. పిచ్‌ పొడిగా ఉండటంతో.. బ్యాటింగ్‌తో పాటు స్పిన్నర్లకు సహకారం లభిస్తుంది. క్రీజ్‌లో కుదురుకుంటే మాత్రం పరుగులు చేయడం చాలా సులువు.


చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీకి (200th game for MS Dhoni as CSK Captain) ఈ మ్యాచ్ చాలా ప్రత్యేకం. ధోనీ చెన్నైకి 200వ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఎంఎస్ ధోనీకి ప్రత్యేకంగా గిఫ్ట్‌ ఇస్తామని స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా చెప్పాడు. ఎంఎస్ ధోనీ క్రికెట్‌ లెజెండ్‌ అని 200వ మ్యాచ్‌కు నాయకత్వం వహిస్తున్న ధోనీకి స్పెషల్‌ గిఫ్ట్‌ను అందిస్తామన్నాడు. చెపాక్‌లో గెలిస్తే మాతో పాటు అభిమానులు ఆనందంగా ఉంటారని జడేజా తెలిపాడు. 


Also Read: Realme Narzo N55: అద్భుతమైన ఫోన్‌ని తీసుకొచ్చిన రియల్‌మీ.. డిజైన్‌ని చూసి ఫిదా అవుతున్న మొబైల్ ప్రియులు! ధర 11 వేలు మాత్రమే  



తుది జట్టు:
రాజస్థాన్‌: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్/వికెట్ కీపర్), దేవదత్‌ పడిక్కల్, ధ్రువ్ జురెల్, షిమ్రోన్ హెట్‌మయర్, జేసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, కుల్‌దీప్‌ సేన్‌, సందీప్‌ శర్మ, యుజ్వేంద్ర చహల్‌.
చెన్నై: రుతురాజ్‌ గైక్వాడ్, డేవాన్ కాన్వే, అజింక్య రహానె, మొయిన్ అలీ, శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్/వికెట్ కీపర్), మగాలా, మహీశ్ తీక్షణ, తుషార్‌ దేశ్‌పాండే, ఆకాశ్ సింగ్‌.


Also Read: David Warner: డేవిడ్ వార్నర్‌పై దారుణమైన ట్రోలింగ్.. వరల్డ్‌ కప్‌ ప్రాక్టీస్‌కు వచ్చావా..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.