Update on Mahindra Singh Dhoni Retirement:  ఐపీఎల్ 2023 ఫైనల్ పోరు ముగిసింది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ జట్టును 5 వికెట్ల తేడాతో ఓడించి చెన్నై సూపర్‌కింగ్స్ విజేతగా నిలిచింది. ఐదవసారి ఐపీఎల్ టైటిల్ గెల్చుకుని ముంబై సరసన నిలిచింది. మరి ధోనీ సంగతేంటి, రిటైర్మెంట్ ప్రకటించారా లేదా..ఏమైంది


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2004లో అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగ్రేటం చేసిన మహేంద్రసింగ్ ధోని 2019లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఇక అప్పట్నించి ఐపీఎల్ ఆడుతూ వస్తున్న మహేంద్ర సింగ్ ధోని 2023 ఐపీఎల్ సీజన్ అనంతరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి కూడా తప్పుకుంటున్నట్టు వార్తలు ప్రచారమయ్యాయి. సీఎస్కే ఆడిన ప్రతిసారీ ధోనీ రిటైర్మెంట్ కోసం ఎవరికి వారు వ్యాఖ్యానాలు చేస్తూ వచ్చారు. ఓ దశలో ఇది తన చివరి దశ అని ధోనీ కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. 


ధోనీ రిటైర్మెంట్ విషయంలో వస్తున్న వార్తలపై టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 15 ఏళ్లుగా ఐపీఎల్ ఆడుతున్నాడు..ఆడినంతకాలం అద్భుతంగానే ఆడాడు. అంతా అతనికి కృతజ్ఞత చెప్పుకోవాలి, జీవితాంతం ఆడుతూనే ఉండమంటారా అంటూ నెటిజన్ల ప్రశ్నలకు బదులిచ్చాడు. ఈ క్రమంలోనే ధోనీకు ఐపీఎల్ 2023 చివరి సీజన్ అనే ప్రచారం పెరిగింది. ఇప్పటికే ఇవాళ్టి మ్యాచ్‌తో సీఎస్కే బ్యాటర్ అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇదే తన చివరి మ్యాచ్ అని ముందే చెప్పాడు. దాంతో ధోనీ కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తారనే వార్తలు వ్యాపించాయి. ఇది విన్న ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. 


Also Read: Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న ట్రాఫిక్ ఆంక్షలు ఇవే


ధోనీ రిటైర్మెంట్ లేనట్టే..మరో సీజన్ ఆడనున్న మహీ


అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం ధోనీ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఉత్సాహం నింపాయి. ఫ్యాన్స్‌కు ఓవిధంగా ధోనీ గుడ్‌న్యూస్ అందించాడు. ఇదే చివరి సీజన్ అని చెప్పడం కష్టమౌతుందని..మరో సీజన్ వరకూ కొనసాగవచ్చని స్పష్టం చేశాడు. ఇంకా సమయం ఉన్నందున అప్పటి తన ఆరోగ్యం, ఫిట్నెస్‌ను బట్టి మరో సీజన్ ఆడే విషయపై నిర్ణయం తరువాత తీసుకుంటానన్నాడు. ఇది విన్న మహీంద్ర సింగ్ ధోనీ అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. 


Also Read: IPL 2023 Winner: ఐపీఎల్ 2023 ఫైనల్ జీటీ వర్సెస్ సీఎస్కే చివరి ఓవర్‌లో ఏం జరిగింది, చెన్నై ఎలా గెలిచింది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , FacebooKమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి