IPL 2023 Points Table Update: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌ 2023 గ్రాండ్‌గా ప్రారంభమైంది. అన్ని జట్లు ఒక్కో మ్యాచ్‌ ఆడేశాయి. తొలి మ్యాచ్‌లో గుజరాత్, చెన్నై జట్లు నువ్వా నేనా రీతిలో తలపడి అభిమానులకు ఫుల్‌ కిక్ ఇచ్చాయి. ఆ తరువాత బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం చెలాయిస్తూ.. ప్రేక్షకులను బౌండరీల వర్షంలో ముంచెత్తారు. ఆదివారం జరిగిన రెండు మ్యాచ్‌ల్లో పరుగుల వరద పారింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ ఆకాశమే హద్దుగా చెలరేగగా.. కోహ్లీ, డుప్లెసిస్ దూకుడుకు బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం చినబోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముంబై ఇండియన్స్‌పై 8 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుతమైన విజయం సాధించగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 72 పరుగుల భారీ తేడాతో చిత్తుచేసింది రాజస్థాన్ రాయల్స్. టోర్నీలో ఐదు మ్యాచ్‌లు ముగిసిపోగా.. అన్ని జట్లు ప్రత్యర్థులతో ఒక్కో మ్యాచ్ ఆడాయి. హైదరాబాద్‌పై భారీ విజయంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికను మొదటిస్థానంతో ఆరంభించింది. రెండు పాయింట్లతో పాటు 3.600 నెట్‌ రన్‌రేట్‌ను తన ఖాతాలో వేసుకుంది.


ఢిల్లీ క్యాపిటల్స్‌ను 50 పరుగులతో ఓడించిన లక్నో సూపర్ జెయింట్స్ రెండోస్థానంలో ఉంది. ప్రస్తుతం లక్నో జట్టు నెట్ రన్ రేట్ 2.500గా ఉంది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఉంది. 2 పాయింట్లు, నెట్ రన్‌రేట్ 1.981 ఉంది. నాల్గో స్థానంలో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ జట్టు ఉంది. చెన్నై సూపర్ కింగ్స్‌పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం గుజరాత్ జట్టు నెట్ రన్‌రేట్ 0.514గా ఉంది.


కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించిన పంజాబ్ కింగ్స్ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. జట్టు నెట్ రన్‌రేట్ 0.425గా ఉంది. కోల్‌కతా 6, చెన్నై 7వ స్థానాల్లో ఉన్నాయి. పాయింట్ల పట్టికలో చివరి మూడు స్థానాల్లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఉన్నాయి. ఈ మూడు జట్లు భారీ తేడాతో ఓటమి పాలవ్వడంతో నెట్‌ రన్‌రేట్ దారుణంగా పడిపోయింది. 


స్థానం జట్టు మ్యాచ్‌లు గెలుపు ఓటమి పాయింట్లు నెట్‌ రన్‌రేట్‌
1 రాజస్థాన్ రాయల్స్ 1 1 0 2 +3.600
2 లక్నో సూపర్ జెయిట్స్ 1 1 0 2 +2.500
3 రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు 1 1 0 2 +1.981
4 గుజరాత్ టైటాన్స్ 1 1 0 2 +0.514
5 పంజాబ్ కింగ్స్ 1 1 0 2 +0.438
6 కోల్‌కత్తా నైట్ రైడర్స్ 1 0 1 0 -0.438
7 చెన్నై సూపర్ కింగ్స్ 1 0 1 0 -0.514
8 ముంబై ఇండియన్స్ 1 0 1 0 -1.981
9 ఢిల్లీ క్యాపిటల్స్ 1 0 1 0 -2.500
10 సన్ రైజర్స్ హైదరాబాద్ 1 0 1 0 -3.600

Also Read: తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ భారీ ఓటమి.. రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ


Also Read: RCB Vs MI Highlights: ముంబై బౌలర్లకు చుక్కలు.. చెలరేగిన విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి