PBKS vs GT: టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్.. రెండు మార్పులతో బరిలోకి పంజాబ్ కింగ్స్!
Gujarat Titans have won the toss and have opted to field. ఐపీఎల్ 2023లో భాగంగా మరికాసేపట్లో మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తలపడనుంది.
IPL 2023, PBKS vs GT Playing 11 Out: ఐపీఎల్ 2023లో భాగంగా మరికాసేపట్లో మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో పంజాబ్ ముందుగా బ్యాటింగ్ చేయనున్నాడు. పంజాబ్ తుది జట్టులో కెప్టెన్ ధావన్ రెండు మార్పులు చేశాడు. నాథన్ ఎల్లిస్ స్థానంలో కగిసో రబాడ, సికిందర్ రజా స్థానంలో భానుక రాజపక్స వచ్చాడు.
గతంలో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన పేసర్ మోహిత్ శర్మ ఐపీఎల్ 2023 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్నాడు. పంజాబ్‌తో జరిగే నేటి మ్యాచ్‌తో గుజరాత్ తరఫున అరంగేట్రం చేస్తున్నాడు. పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్‌పై మోహిత్‌కు మంచి రికార్డు ఉంది. 10 ఇన్నింగ్స్‌ల్లో ధావన్‌ను నాలుగు సార్లు ఔట్ చేశాడు.
తుది జట్లు:
పంజాబ్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, భానుక రాజపక్స, జితేష్ శర్మ(వికెట్ కీపర్), సామ్ కరన్, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబాడ, రిషి ధావన్, అర్ష్‌దీప్ సింగ్.
గుజరాత్: వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ, లిటిల్.
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌లు:
పంజాబ్: అథర్వ తైదే, రాహుల్ చాహర్, సికందర్ రజా, గుర్నూర్ బ్రార్, హర్‌ప్రీత్ భాటియా.
గుజరాత్: విజయ్ శంకర్, శివమ్ మావి, జయంత్ యాదవ్, అభినవ్ మనోహర్, శ్రీకర్ భరత్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.