Lucknow Super Giants Vs Mumbai Indians Dream 11 Team Tips And Playing 11: ఐపీఎల్‌లో నేడు మరో జట్టు ఇంటి ముఖం పట్టనుంది. లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య నేడు ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. గ్రూప్ దశలో లక్నో 14 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 17 పాయింట్లతో మూడోస్థానంలో నిలవగా.. ముంబై 8 విజయాలు, 16 పాయింట్లతో నాలుగోస్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫైయర్-2లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. బుధవారం రాత్రి 7.30 గంటలకు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్ ప్రారంభంకానుంది. పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డులు, ప్లేయింగ్ 11, డ్రీమ్ 11 టీమ్ టిప్స్ మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పిచ్ రిపోర్ట్ ఇలా..


చెన్నై పిచ్ కాస్త స్లోగా కనిపిస్తోంది. మంగళవారం గుజరాత్ వంటి పటిష్టమైన జట్టుపై 172 పరుగులను కాపాడుకుంది చెన్నై జట్టు. పిచ్ నుంచి బ్యాట్స్‌మెన్లకు, బౌలర్లకు సమాన సహకారం లభిస్తుంది. పిచ్ మంచి బౌన్స్‌తో ఫ్లాట్‌గా ఉంటుందని భావిస్తున్నారు. బ్యాట్స్‌మెన్లు స్వేచ్ఛగా షాట్‌లను ఆడేందుకు వీలుంటుంది. ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్లకు స్వింగ్‌తో ఇబ్బంది పెట్టే ఛాన్స్‌ ఉంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమైన స్వభావాన్ని బట్టి.. టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్‌కు మొగ్గు చూపే అవకాశం ఉంది. 


హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా..


ఇప్పటివరకు రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌లు జరగ్గా.. మూడింటిలోనూ లక్నోనే విజయం సాధించింది. గతేడాది ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో మొదటిసారి ఈ రెండు జట్లు తలపడగా.. లక్నో సూపర్ జెయింట్స్ 18 పరుగుల తేడాతో గెలిచింది. రెండో మ్యాచ్‌ వాంఖడే స్టేడియంలో జరగ్గా.. 36 పరుగుల తేడాతో లక్నో విజయం సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో 5 పరుగుల తేడాతో గెలిచింది. నేటి మ్యాచ్‌లో పైచేయి ఎవరిదో చూడాలి. రెండు జట్లు బలంగా ఉండడంతో ఉత్కంఠభరిత పోరు జరిగే అవకాశం ఉంది.


తుది జట్లు ఇలా.. (అంచనా)


లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), కరణ్ శర్మ, ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా (కెప్టెన్), ఆయుష్ బదోని, కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, నవీన్-ఉల్-హక్.


ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, విష్ణు వినోద్, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, ఆకాష్ మధ్వల్.


డ్రీమ్ 11 టీమ్ ఇలా..


వికెట్ కీపర్లు: ఇషాన్ కిషన్, క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్
బ్యాట్స్‌మెన్లు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రోహిత్ శర్మ
ఆల్‌రౌండర్లు: కామెరూన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్ (వైస్ కెప్టెన్)
బౌలర్లు: ఆకాష్ మధ్వల్, మొహ్సిన్ ఖాన్, రవి బిష్ణోయ్, పీయూష్ చావ్లా.


Also Read: Jammu Kashmir Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి  


Also Read: Virat Kohli: థ్యాంక్యూ బెంగుళూరు.. విరాట్ కోహ్లీ ఎమోషనల్ ట్వీట్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook