IPL 2023 Playoff Chances: ఐపీఎల్ 2023 లీగ్ మ్యాచులు తుది దశకు చేరుకున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ మినహా ప్రతీ జట్టు 11 మ్యాచ్‌లు ఆడేసింది. లీగ్ దశ ముగింపునకు వచ్చినా.. గతేడాది మాదిరిగానే ప్లే ఆఫ్స్ చేరే జట్లు ఏవో ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఇప్పటికీ కూడా 10 జట్లు రేసులోనే ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్ దాదాపుగా ప్లే ఆఫ్స్ చేరుకునట్టే. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్.. ప్లే ఆఫ్స్ రేసు (IPL 2023 Playoff Scenario) నుంచి దాదాపు తప్పుకుంది. చెన్నై, ముంబై, రాజస్థాన్, లక్నో జట్లకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్స్ సినారియోను ఓసారి చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ హవా కొనసాగుతోంది. 11 మ్యాచులలో 8 విజయాలతో 16 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. గుజరాత్ ప్లే ఆఫ్స్ బెర్త్ దాదాపు ఖారారు అయ్యింది. చివరి మూడు మ్యాచ్‌ల్లో ఓడినా.. ప్లే ఆఫ్స్ బెర్త్‌కు డోకా లేదు. 12 మ్యాచ్‌లు ఆడి 15 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దాపుగా ఖాయం చేసుకుంది. ఇంకో విజయం సాధిస్తే ఆ జట్టుకు తిరుగుండదు. చివరి 2 రెండు మ్యాచ్‌లు ఓడితే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.


11 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ 12 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం ముంబైకి ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు బాగానే ఉన్నాయి. చివరి మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే.. ప్లే ఆఫ్స్ చేరుతుంది. ఒకవేళ రెండు మ్యాచ్‌ల్లోనే గెలిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. 11 మ్యాచ్‌ల్లో 11 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ రేసులో ఉంది. అయితే మిగతా 3 మ్యాచ్‌ల్లో లక్నో గెలవాల్సి ఉంది. ఒక్క మ్యాచ్ ఓడినా మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. 


10 పాయింట్లు ఉన్న 5, 6, 7, 8 స్థానాల్లో కొనసాగుతున్న రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ కూడా ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నాయి. ఈ నాలుగు జట్లు మిగిలిన మూడు మ్యాచులలో గెలవాల్సి ఉంటుంది. ఏ ఒక్కటి ఓడినా ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతవుతాయి. ప్లే ఆఫ్స్ రేసులో రాజస్థాన్, కోల్‌కతా, బెంగళూరు, పంజాబ్ మధ్య తీవ్ర పోటీ ఉంటుంది. మరి ఏ జట్లు ప్లే ఆఫ్స్ చేరుతాయో చూడాలి. 


Also Read: 'మళ్లీ పెళ్లి' ట్రైలర్‌.. ఎప్పుడు లేస్తుందో ఎప్పుడు పడుతుందో! నరేశ్‌, పవిత్రల రొమాన్స్ మాములుగా లేదుగా  


Also Read: Ravindra Jadeja: నేను త్వరగా ఔటై పోవాలని ఎంఎస్ ధోనీ ఫాన్స్ కోరుకుంటారు: జడేజా  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.