IPL 2023 Rajasthan Royals on Top in IPL 2023 Points Table: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 రసవత్తరంగా సాగుతోంది. అన్ని జట్లు మూడేళ్ల తర్వాత సొంత మైదానాల్లో ఆడుతూ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతున్నాయి. 10 జట్లు గెలుపు కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్లే ఆఫ్స్ లక్ష్యంగా బరిలోకి దిగినా.. కొన్ని జట్లకు నిరాశ తప్పడం లేదు. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. దాంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2023లో రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుతం మూడు గేమ్‌లలో రెండు గెలిచి.. నాలుగు పాయింట్లతో పట్టికలో (IPL 2023 Points Table) అగ్రస్థానంలో ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ మూడు మ్యాచులలో రెండింట గెలిచి 4 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ (4 పాయింట్స్) మూడో స్థానంలో, గుజరాత్ టైటాన్స్ (4 పాయింట్స్) నాలుగో స్థానంలో ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ (4 పాయింట్స్) ఐదో స్థానంలో, పంజాబ్ కింగ్స్ (4 పాయింట్స్) ఆరో స్థానంలో ఉన్నాయి.


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు రెండు గేమ్‌లలో ఒకటి గెలిచి.. రెండు పాయింట్లతో పట్టికలో ఏడవ స్థానంలో ఉంది. అదే 2 పాయింట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎనిమిదో స్థానంలో ఉంది. ఆడిన మూడు మ్యాచులలో ఓడిన ముంబై ఇండియన్స్ తొమ్మిదో స్థానంలో ఉంది, ఢిల్లీ క్యాపిటల్స్ 10వ స్థానంలో ఉంది. పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న ముంబై, ఢిల్లీలు ఇప్పటికైనా పుంజుకోకుంటే.. మూల్యం చెల్లించుకోక తప్పదు. 


Also Read: Vodafone Idea Recharge Plans 2023: వోడాఫోన్ ఐడియా సరికొత్త రీఛార్జ్ ప్లాన్.. ఎయిర్‌టెల్‌, జియోలకు ఇక చుక్కలే!



పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఆరెంజ్ క్యాప్‌లో (IPL 203 Orange Cap) అగ్రస్థానంలో ఉన్నాడు. మూడు మ్యాచ్‌లలో 225 పరుగులు చేశాడు. చెన్నై ఓపెనర్  రుతురాజ్ గైక్వాడ్ మూడు మ్యాచ్‌లలో 189 పరుగులతో రెండవ స్థానంలో ఉన్నాడు. ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మూడు మ్యాచ్‌లలో 158 పరుగులతో మూడవ స్థానంలో ఉండగా.. రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ మూడు మ్యాచ్‌లలో 152 పరుగులతో నాల్గవ స్థానంలో ఉన్నాడు. లక్నో ఓపెనర్ కైల్ మేయర్స్ మూడు మ్యాచ్‌లలో 139 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక గుజరాత్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మూడు మ్యాచ్‌లలో ఎనిమిది వికెట్లతో పర్పుల్ క్యాప్ (IPL 2023 Purple Cap) రేసులో ముందంజలో ఉన్నాడు. 


Also  Read: Best Airtel Recharge Plan 2023: ఎయిర్‌టెల్‌ చౌకైన రీఛార్జ్ ప్లాన్.. 56 రోజుల పాటు పండగే పండగ! ఫుల్ డిమాండ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి