IPL 2023 Points Table: రేసులో దూసుకువచ్చిన ఆర్‌సీబీ.. ఆ జట్టు మాత్రం ఔట్
IPL Points Table Latest Update: ఐపీఎల్లో చివరి దశకు వచ్చేసరికి రేసు మరింత ఆసక్తికరంగా మారుతోంది. మొదట్లో హాట్ ఫేవరేట్‌గా నిలిచిన జట్లు.. ఇప్పుడు పాయింట్ల పట్టికలో వెనుకబడుతున్నాయి. ఆఖరి మ్యాచ్ వరకు ప్లే ఆఫ్ బెర్త్‌ల కోసం ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉండనుంది.
IPL Points Table Latest Update: ఐపీఎల్ 2023 సీజన్ ముగింపునకు వచ్చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 61 లీగ్ మ్యాచ్‌లు ముగిసినా.. ఇంకా ఏ జట్టు ఫైనల్‌కు చేరుకుంటుందో క్లారిటీ రాలేదు. ఆదివారం జరిగిన రెండు మ్యాచ్‌లతో పాయింట్ల పట్టికలో మార్పులు చోటు చేసుకున్నాయి. రాజస్థాన్‌పై భారీ విజయంతో నెట్ రన్‌రేట్ మెరుగుపరుచుకోవడంతోపాటు పాయింట్ల పట్టికలో ఐదోస్థానానికి చేరుకుంది ఆర్‌సీబీ. చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయంతో కేకేఆర్ పాయింట్ల పట్టికలో ఏడోస్థానానికి చేరుకుంది. అదృష్టం కలిసి వస్తే.. తాము కూడా ప్లే ఆఫ్‌కు చేరొచ్చని ఆ జట్టు నమ్ముతోంది. 13 లీగ్ మ్యాచ్‌ల ఆడిన కోల్‌కతా.. 6 విజయాలతో 12 పాయింట్లను కలిగి ఉంది. నెట్ రన్‌రేట్ -0.256 మైనస్‌లో ఉంది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ టాప్-4లో కొనసాగుతున్నాయి. గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకు 12 మ్యాచుల్లో 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 16 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ కూడా 0.761 మెరుగ్గా ఉంది. మరో రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచినా.. టాప్-2 ప్లేస్‌తో ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయినా.. గుజరాత్ ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ 13 మ్యాచ్‌లలో 15 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. నెట్ రన్‌రేట్ 0.381 కూడా బాగానే ఉంది. చివరి మ్యాచ్‌లో తప్పకుండా గెలిస్తే.. ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. లేదంటే ఇతర జట్ల సమీకరణలపై ఆధారపడాల్సి ఉంటుంది.
ముంబై ఇండియన్స్ 12 మ్యాచ్‌లు ఆడి.. ఏడు విజయాలు సాధించింది. 14 పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో 2 నెగ్గితే.. 18 పాయింట్లతో ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్లే ఆఫ్‌లో అడుపెడుతుంది. ఒకటి ఓడి.. ఒకటి గెలిచినా ప్లే ఆఫ్‌లో అడుగుపెట్టేందుకు ఛాన్స్ ఉంటుంది. రెండూ ఓడితే.. ఇతర జట్ల ఫలితాలపై ముంబై భవితవ్యం ఆధారపడుతుంది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 12 మ్యాచ్‌ల్లో 13 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ 0.309 కూడా బాగానే ఉంది. చివరి రెండు మ్యాచ్‌లు గెలిస్తే.. ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒకటి గెలిచి.. ఒకటి ఓడినా.. ఆశలు ఉంటాయి. రెండూ ఓడితే.. టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
రాజస్థాన్ రాయల్స్‌పై 112 పరుగుల భారీ విజయంతో ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. 12 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లతో.. నెట్ రన్‌రేట్ 0.166గా ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌లు నెగ్గితే ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. రాజస్థాన్ రాయల్స్ చేజేతులా పాయింట్ల పట్టికలో కిందకు పడిపోయింది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌లను చేజార్చుకుని.. ఆరో స్థానానికి చేరుకుంది. 13 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 12 పాయింట్లు సాధించింది. మరో మ్యాచ్ గెలిచినా.. ఇతర సమీకరణాలపై భవితవ్యం ఆధారపడి ఉంటుంది. కేకేఆర్‌ది కూడా అదే పరిస్థితి. చివరి మ్యాచ్ నెగ్గినా.. ఇతర జట్ల ఓటమి కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది.
పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉన్నా.. ప్లే ఆఫ్ ఆశలు మెరుగ్గా ఉన్నాయి. 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లను కలిగి ఉంది. చివరి రెండు మ్యాచ్‌లు గెలిస్తే.. ఆఫ్స్‌కు చేరేందుకు అవకాశం ఉంటుంది. 11 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. 8 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ -0.471 కూడా చాలా తక్కువగా ఉంది. చివరి మూడు మ్యాచ్‌ల్లో గెలిచినా.. ప్లే ఆఫ్స్‌కు చేరడం కష్టమే. ఈ సీజన్‌లో ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది. 12 మ్యాచ్‌లలో 4 మాత్రమే గెలిచి 8 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఢిల్లీ గెలిస్తే.. ప్లే ఆఫ్ రేసులో ఇతర జట్లపై భారీ ప్రభావం చూపిస్తుంది.
Also Read: Phone Tracking: మొబైల్ దొంగతనాలకు చెక్.. కేంద్రం సరికొత్త విధానం
Also Read: Kadapa Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి