IPL 2023 Prize Money Full List: ఐపీఎల్‌ 2023 ట్రోఫీ గుజరాత్‌ టైటాన్స్‌ను ఊరించి ఊరించి.. చివరికి చెన్నై సూపర్ కింగ్స్‌కే చిక్కింది. సోమవారం తీవ్ర ఉత్కంఠ మధ్య చివరి బంతి వరకు సాగిన మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్‌ 4 వికెట్లకు 214 పరుగులు చేసింది. సాయి సుదర్శన్‌ (96; 47 బంతుల్లో 8×4, 6×6) తృటిలో సెంచరీ మిస్ కాగా.. వృద్ధిమాన్‌ సాహా (54; 39 బంతుల్లో 5×4, 1×6) హాఫ్ సెంచరీ బాదాడు. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో చెన్నై విజయ లక్ష్యం 15 ఓవర్లలో 171గా మారింది. 15 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చెన్నై లక్ష్యాన్ని ఛేదించింది. దేవాన్ కాన్వే (47; 25 బంతుల్లో 4×4, 2×6), శివమ్ దూబె (32 నాటౌట్‌; 21 బంతుల్లో 2×6) రాణించారు. ఐపీఎల్ 16వ సీజన్ ముగిసిన నేపథ్యంలో అవార్డు విజేతలు, ప్రైజ్‌మనీ వివరాలను ఓసారి చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

# మొత్తం ప్రైజ్‌మనీ: రూ. 46 కోట్ల 50 లక్షలు 
# విజేత జట్టుకు: రూ. 20 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్) 
# రన్నరప్‌ జట్టుకు: రూ. 13 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
# మూడో స్థానం: రూ. 7 కోట్లు -(ముంబై ఇండియన్స్‌) 
# నాలుగో స్థానం: రూ. 6 కోట్ల 50 లక్షలు (లక్నో సూపర్‌ జెయింట్స్‌) 


#ఆరెంజ్‌ క్యాప్‌ (అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌): 
శుబ్‌మన్‌ గిల్‌ (890 పరుగులు; 17 మ్యాచ్‌లు- సెంచరీలు: 3, అర్ధ సెంచరీలు: 4)
ప్రైజ్‌మనీ: రూ. 15 లక్షలు 


# పర్పుల్‌ క్యాప్‌ (అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌) 
మొహమ్మద్‌ షమీ (28 వికెట్లు; 17 మ్యాచ్‌లు) 
ప్రైజ్‌మనీ: రూ. 15 లక్షలు  


# సూపర్‌ స్ట్రైకర్‌ ఆఫ్‌ ది సీజన్‌: గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (బెంగళూరు- రూ. 10 లక్షలు)
# మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సీజన్‌: శుబ్‌మన్‌ గిల్‌ (గుజరాత్- రూ. 10 లక్షలు)
# గేమ్‌ ఛేంజర్‌ ఆఫ్‌ ది సీజన్‌: శుబ్‌మన్‌ గిల్‌ (గుజరాత్- రూ. 10 లక్షలు)
# క్యాచ్‌ ఆఫ్‌ ది సీజన్‌: రషీద్‌ ఖాన్‌ (గుజరాత్- రూ. 10 లక్షలు)
# ఫెయిర్‌ ప్లే అవార్డు: ఢిల్లీ క్యాపిటల్స్‌
# అత్యధిక ఫోర్లు: శుబ్‌మన్‌ గిల్‌ (గుజరాత్- రూ. 10 లక్షలు)
# లాంగెస్ట్‌ సిక్స్‌: ఫాఫ్‌ డుప్లెసిస్‌ (బెంగళూరు- రూ. 10 లక్షలు)
# బెస్ట్‌ పిచ్‌, గ్రౌండ్‌: ఈడెన్‌ గార్డెన్స్‌, వాంఖడే స్టేడియం (రూ. 50 లక్షలు)


Also Read: అతడొక అద్భుత క్రికెటర్‌.. అతడు ఉంటే నేను అవార్డును గెలవలేను: ఎంఎస్ ధోనీ


Also Read: MS Dhoni-Jadeja: జడేజాను ఎత్తుకుని.. కంట తడిపెట్టిన ఎంఎస్ ధోనీ! వైరల్ వీడియో  
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK.