Virat Kohli News: ఐపీఎల్‌ 2023లో మరో ఉత్కంఠభరిత పోరు జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై చెన్నై సూపర్ కింగ్స్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. హైస్కోరింగ్ మ్యాచ్‌ ప్రేక్షకులకు ఆద్యంతం అలరించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. చెన్నై ఓపెనర్ డేవాన్ కాన్వే (83) దుమ్ములేపగా.. శివమ్ ధుబే (52) మెరుపులు మెరిపించాడు. అనంతరం బెంగుళూరు జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 218 రన్స్ చేసింది. డుప్లెసిస్ (62), మాక్స్‌వెల్ (76) చెలరేగడంతో ఒకనొక దశలో ఆర్‌సీబీ గెలుపు వైపు దూసుకెళ్లింది. అయితే వరుసగా వికెట్లు కోల్పోవడంతో చివరికి 8 పరుగుల తేడాతో విజయానికి దూరంగా ఆగిపోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ జరిమానాకు గురయ్యాడు. మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోత పడింది. కోహ్లీ కూడా తన తప్పును అంగీకరించాడు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2లోని లెవల్-1 నేరం కింద కోహ్లీ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ శివమ్ ధుబే ఔట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ దూకుడుగా సంబురాలు జరుపుకున్నాడు. 


ఈ క్రమంలో తన నోటికి పనిచెప్పాడు. కొన్ని అసభ్య పదాలను ఉపయోగించినట్లు తేలింది. సీఎస్‌కే ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఆర్‌సీబీ ఫాస్ట్ బౌలర్ వేన్ పార్నెల్ మూడో బంతిని శివమ్ ధుబేను భారీ షాట్ కొట్టగా.. సిరాజ్ చక్కటి క్యాచ్‌ అందుకున్నాడు. దూకుడు మీద ఉన్న ధూబే ఔట్ అయిన సంతోషంలో విరాట్ కోహ్లీ సహనం కోల్పోయాడు. విచారణలో కోహ్లీ తన తప్పును అంగీకరించడంతో రిఫరీ 10 శాతం ఫైర్ వేశాడు.


Also Read: OPS Latest Update: ఉద్యోగులకు తీపికబురు.. ఓపీఎస్‌ అమలుకు నోటిఫికేషన్


భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సూపర్ ఇన్నింగ్స్ ఆడాలని కోహ్లీ క్రీజ్‌లోకి వచ్చాడు. రెండో బంతిని బౌండరీకి తరలించి జోష్‌లో కనిపించాడు. అయితే దురదృష్టం వెంటాడి ఔట్ అయ్యాడు. మరో భారీషాట్‌కు యత్నించగా.. బాల్ కోహ్లీ ప్యాడ్‌లకు తగిలి మెల్లగా బెయిల్స్‌ను పడగొట్టింది. దీంతో కోహ్లీ నిరాశగా పెవిలియన్‌కు చేరుకున్నాడు. స్టేడియం మొత్తం ఒక్కసారిగా సెలైంట్ అయింది. 


Also Read: Karnataka Assembly Elections: చదివింది తొమ్మిదో తరగతి.. రూ.1,609 కోట్లకు అధిపతి.. మంత్రి ఆస్తుల వివరాలు వెల్లడి  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook