RCB vs MI: ఆర్సీబీకి మరో ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్‌కు తీవ్ర గాయం
Reece Topley Injury: రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ రీస్ టోప్లీకి తీవ్ర గాయమైంది. ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బంతిని అడ్డుకునే క్రమంలో గాయపడ్డాడు.
Reece Topley Injury: ఐపీఎల్‌ను గాయాల బెడద వీడడం లేదు. ప్రారంభానికి ముందే కీలక ఆటగాళ్లు దూరమవ్వగా.. ఇప్పుడు ఫీల్డ్‌లో గాయపడుతూ కీ ప్లేయర్లు ఇబ్బందిపడుతున్నారు. మొదటి మ్యాచ్‌లోనే గుజరాత్ స్టార్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ బౌండరీ లైన్ వద్ద క్యాచ్ అందుకునే క్రమంలో గాయపడి టోర్నీకే దూరమయ్యాడు. తాజాగా బెంగుళూరు పేసర్ రీస్ టోప్లీ గాయపడడం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్‌సీబీ బౌలింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్ 8వ ఓవర్‌లో ఆర్‌సీబీ స్పిన్నర్ కర్ణ్‌శర్మ వేసిన బంతిని ముంబై బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ ఫైన్ లెగ్ వైపు ఫ్లిక్ చేశాడు. బంతిని ఆపేందుకు వచ్చిన టోప్లీ డైవ్ చేశాడు. ఈ సమయంలో అతని కుడి భుజానికి గాయమైంది. నొప్పితో బాధపడుతూ చాలాసేపు అలానే ఉండిపోయాడు. ఆ తర్వాత జట్టు ఫిజియోతో మాట్లాడిన తర్వాత మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. గాయం తీవ్రత ఇంకా తెలియరాలేదు. అంతకుముందు ఈ మ్యాచ్‌లో రీస్ టాప్లీ 2 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి కేమరూన్ గ్రీన్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఇప్పటికే ఆర్‌సీబీ స్టార్ బౌలర్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమవ్వగా.. తాజాగా టోప్లీ కూడా గాయడపడటం ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది.
ఇక ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ బౌలర్లు అదిరిపోయే ప్రదర్శన చేశారు. ఆరంభంలోనే ముంబై బ్యాట్స్‌మెన్లు ఇషాన్ కిషన్ (10), రోహిత్ శర్మ (1), కెమెరూన్ గ్రీన్ (5), సూర్యకుమార్ యాదవ్ (15)ను తక్కువ స్కోర్లకే వరుసగా పెవిలియన్‌కు పంపించారు. అయితే యంగ్ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ (46 బంతుల్లో 84, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటి చెత్తో ముంబైను ఒడ్డుకు చేర్చాడు. వికెట్లు పడుతున్నా.. ఆర్‌సీబీ బౌలర్లను ఏ మాత్రం లెక్కచేయకుండా భారీ షాట్లు ఆడాడు. తిలక్ వర్మ అద్భుత ఇన్నింగ్స్‌తో ముంబై 20 ఓవర్లు ముగిసేసరికి ఏడు వికెట్ల నష్టానికి 171 రన్స్ చేసింది.
Also Read: తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ భారీ ఓటమి.. రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ
Also Read: RCB vs MI Match Updates: ఐపీఎల్‌లో మరో సూపర్ ఫైట్.. టాస్ గెలిచిన ఆర్‌సీబీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి