IPL 2023 Updates: ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి.. ఐపీఎల్‌లో కొందరు ప్లేయర్లను చూస్తుంటే ఈ సామెత గుర్తుస్తోంది. ఐపీఎల్‌లో ఎవరు ఎప్పుడు ఎలా ఆడతారనేది ముందే ఊహించడం కష్టం. ముఖ్యంగా ఈ సీజన్‌లో ఎవరూ ఊహించని ప్లేయర్లు సత్తాచాటుతున్నారు. ముఖ్యంగా టీమిండియా దారులు మూసుకుపోయిన ప్లేయర్లు ప్రభావం చూపిస్తుండడం విశేషం. చాలాకాలాంగా భారత జట్టుకు దూరంగా ఉన్న ఆటగాళ్లు టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు. ముఖ్యంగా ముగ్గురు ఆటగాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ ముగ్గురు ఎవరంటే.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పీయూష్ చావ్లా..


టీమిండియా జట్టులో లెగ్ స్పిన్నర్‌గా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన పీయూష్‌ చావ్లా ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్‌లో ముంబై ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌లోనే విజయం సాధించింది. పీయూష్ చావ్లా మూడు మ్యాచ్‌ల్లోనూ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. ఆర్‌సీబీపై పొదుపుగా బౌలింగ్ చేయగా.. చెన్నైపై మ్యాచ్‌లో దూకుడుగా ఆడుతున్న అజింక్యా రహానేను ఔట్ చేశాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో మూడు వికెట్లతో చెలరేగాడు. టోర్నీ ముంబై ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడనుండడంతో చావ్లా మరింత కసిగా బౌలింగ్ చేసే అవకాశం ఉంది. 


అమిత్ మిశ్రా


ఈ ఐపీఎల్ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా.. తన ప్రదర్శనలో అబ్బురపరుస్తున్నాడు. వికెట్లు ఎక్కువగా తీయకున్నా.. బ్యాట్స్‌మెన్‌ను పరుగులు చేయకుండా కట్టడి చేస్తున్నాడు. మిశ్రా ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేసి మూడు వికెట్లు తీశాడు. ఎకానమీ 6.83గా ఉంది. మిశ్రా చివరిసారిగా 2017లో ఇంగ్లండ్‌తో టీమిండియా తరఫున టీ20 మ్యాచ్‌ ఆడాడు. మళ్లీ ఆ తరువాత భారత జట్టులో ఈ సీనియర్ స్పిన్నర్‌కు చోటు దక్కలేదు.


Also Read: Hyderabad Crime: హైదరాబాద్‌లో దారుణం.. భార్యను వెంటాడి హత్య చేసిన భర్త  
 
మోహిత్ శర్మ


గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మరో సీనియర్ బౌలర్ మోహిత్ శర్మ ఈ సీజన్‌ అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. పంజాబ్ కింగ్స్‌పై  4 ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. ఎకానమీ రేటు 4.50గా ఉంది. యష్ ధయాల్ స్థానంలో జట్టులోకి వచ్చిన మోహిత్ శర్మ.. తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. 2015లో చివరిసారిగా మోహిత్ శర్మ టీమిండియా తరుఫున చివరి మ్యాచ్‌ ఆడాడు. ఆ తరువాత మళ్లీ టీమిండియా జెర్సీ ధరించే అవకాశం రాలేదు.


Also Read: IPL 2023 Updates: చెన్నైపై గెలిచిన రాజస్థాన్‌కు షాక్.. సంజూ శాంసన్‌కు ఫైన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.