IPL 2023 Winner: ఐపీఎల్ 2023 ఫైనల్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య హోరాహోరీగా సాగింది. చివరి వరకూ నరాలు తెగే ఉత్కంఠతోనే మ్యాచ్ కొనసాగింది. అందుకే విజయం చివరి బంతి వరకూ గుజరాత్, చెన్నై జట్లను ఊరించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ అత్యంత రసవత్తరంగా సాగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. గుజరాత్ టైటాన్స్ జట్టులో ఈసారి శుభమన్ గిల్ స్థానంలో సాయి సుదర్శన్ చెలరేగి ఆడాడు. 


ఆ తరువాత 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన చెన్నై సూపర్‌కింగ్స్ 3 బంతులు ఆడి 4 పరుగులు చేసిందో లేదో..భారీ వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. తిరిగి 12.10 గంటలకు ప్రారంభమైనా 15 ఓవర్లకు కుదించారు. మరోవైపు టార్గెట్ మాత్రం 171 పరుగులుగా నిర్ణయించారు. వాస్తవానికి గుజరాత్ 171 పరుగులు చేసింది 17.1 ఓవర్లలో. కానీ రన్‌రేట్ కారణంగా 15 ఓవర్లకే 171 పరుగుల టార్గెట్ నిర్ధారించారు. 171 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డేవన్ కాన్వేలు శుభారంభం ఇచ్చారు. 74 పరుగుల వద్ద తొలి వికెట్ రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అయ్యాడు. ఆ తరువాత కాస్సేపటికే డేవన్ కాన్వే వెనుదిరిగాడు. ఆ తరువాత బరిలో వచ్చిన అజింక్యా రహానే, అంబటి రాయుడు ధాటిగానే ఆడినా ఎక్కువసేపు నిలవలేదు. 


చివరి ఓవర్‌లో ఏమైంది, చెన్నై ఎలా గెలిచింది


చివరికి బరిలో శివమ్ దూబే, రవీంద్ర జడేజాలు మిగిలారు. చివరి ఓవర్‌కు 13 పరుగులు అవసరమైన పరిస్థితి. మోహిత్ శర్మ మొదటి బాల్ యార్కర్ పరుగులేమీ రాలేదు. 5 బంతుల్లో 13 పరుగులు అవసరమయ్యాయి. తరువాతి బంతికి కేవలం ఒక్క పరుగు లభించింది. చెన్నై గెలవాలంటే ఇంకా 4 బంతుల్లో 12 పరుగులు అవసరం. మోహిత్ శర్మ వేసిన మరో బంతికి కూడా ఒకే పరుగు లభించింది. ఇంకా 3 బంతుల్లో 11 పరుగులు కొట్టాలి. ఆ తరువాతి బంతికి కూడా ఒకే ఒక పరుగు లభించింది. చివరి 2 బంతుల్లో 10 పరుగులు అవసరం కాగా రవింద్ర జడేజా సిక్సర్ కొట్టాడు. ఇక ఒకే ఒక బంతి మిగిలింది. విజయానికి 4 పరుగులు అవసరమయ్యాయి చెన్నైకు. అంతే చివరి బంతిని బౌండరీకు తరలించి అద్భుత విజయాన్ని అందించాడు రవీంద్ర జడేజా.


చివరి ఓవర్‌లో మొదటి నాలుగు బాల్స్ అద్బుతంగా బౌల్ చేసిన మోహిత్ శర్మకు ఇది ఊహించని పరిణామం. అందరూ గుజరాత్ టైటాన్స్ విజయం ఖాయమనుకున్నారు. మోహిత్ శర్మ అద్భుతమై యార్కర్‌లతో మొదటి నాలుగు బంతులకు కేవలం 3 పరుగులే రావడంతో చెన్నై కధ ముగిసిందనుకున్నారు. కానీ చివరి రెండు బంతుల్లో ఓ సిక్సర్, ఓ బౌండరీ కధను మార్చేశాయి. చెన్నైకు విజయం అందించాయి.  


Also read: IPL 2023 Title Winner: ఉత్కంఠపోరులో విజయంతో 5వసారి టైటిల్ కైవసం చేసుకున్నచెన్నై, ఎప్పుడెప్పుడంటే



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook