Mumbai Indians Vs Royal Challengers Bangalore Ipl Match Dream11 Team Fantasy Cricket Tips: ఐపీఎల్‌లో నేడు బిగ్‌ఫైట్ జరగనుంది. టీమిండియా హేమాహేమీలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. ముంబై ఇండియన్స్, బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఈ సీజన్‌లో రెండు జట్ల ప్రయాణం దాదాపు సమానంగా ఉంది. రెండు జట్లు కూడా ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఐదింటిలో గెలిచి.. ఐదింటిలో ఓడిపోయాయి. ప్లే ఆఫ్‌ రేసులో నిలబడాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్‌ కీలకంగా మారింది. ఏ జట్టు గెలిచినా.. పాయింట్ల పట్టికలో మూడోస్థానానికి చేరుకుంటుంది. ముంబైలోని వాంఖేడే స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది..? తుది జట్టులో ఎవరుంటారు..? డ్రీమ్ 11 టీమ్‌లో ఎవరిని ఎంచుకోవాలి..?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పిచ్ రిపోర్ట్ ఇలా..


ముంబైలోని వాంఖడే స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 170 పరుగులకుపైగా ఉంది. ఎక్కువగా ఛేజింగ్ చేసిన జట్టునే విజయాలు సాధించాయి. పేసర్లకు కూడా పిచ్ నుంచి మంచి సహకారం లభిస్తుంది. ఈ సీజన్‌లో ఈ పిచ్‌పై జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగుసార్లు రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. దీంతో మరోసారి టాస్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికి వస్తే.. ఇప్పటివరకు 31 సార్లు ఇరు జట్లు తలపడ్డాయి. వాటిలో 17 మ్యాచ్‌ల్లో ముంబై విజయం సాధించింది. మిగిలిన 14 మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ విజేతగా నిలిచింది. 


తుది జట్లు ఇలా.. (అంచనా)
 
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నాదల్ వధేరా, పీయూష్ చావ్లా, జోఫ్రా ఆర్చర్, ఆకాష్ మధ్వల్, అర్షద్ ఖాన్.


బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అనుజ్ రావత్, కేదార్ జాదవ్, వనిందు హసరంగా, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్.


డ్రీమ్ 11 టీమ్ టిప్స్..


వికెట్ కీపర్: ఇషాన్ కిషన్
బ్యాట్స్‌మెన్లు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఫాఫ్ డుప్లెసిస్, సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), మహిపాల్ లోమ్రో
ఆల్‌రౌండర్లు: గ్లెన్ మాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్
బౌలర్లు: మహ్మద్ సిరాజ్, వనిందు హసరంగా, పీయూష్ చావ్లా, జోఫ్రా ఆర్చర్


Also Read: TS Inter Results 2023: ఇంటర్ ఫలితాలు, మార్కుల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Also Read: RR vs SRH IPL 2023 Highlights: హైఓల్టెజ్ థ్రిల్లింగ్ మ్యాచ్.. రాజస్థాన్ కొంపముంచిన నోబాల్.. ఆఖరి బంతికి సిక్సర్‌తో హైదరాబాద్ విక్టరీ


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి