Mumbai Indians Vs Kolkata Knight Riders Dream 11 Tips: ఐపీఎల్ 2023లో భాగంగా ఆదివారం రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. 22వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. ఆడి మూడు మ్యాచ్‌ల్లో ముంబై ఒక మ్యాచ్‌లోనే గెలుపొందింది. చివరి మ్యాచ్‌లో ఢిల్లీ జట్టులపై విజయం సాధించడంతో ముంబై శిబిరంలో ఉత్సాహం నెలకొంది. అటు కోల్‌కతా నాలుగు మ్యాచ్‌లు ఆడగా.. రెండింటిలో విజయం సాధించగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. గెలిచిన రెండు మ్యాచ్‌లు కూడా చివరికి వరకు ఉత్కంఠభరితంగా సాగినవే. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ చేతిలో ఓటమి తర్వాత కోల్‌కతా జట్టు మళ్లీ గెలుపుబాట పట్టాలని చూస్తోంది. రెండు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్న నేపథ్యంలో పోరు ఆసక్తికరంగా సాగనుంది. ముంబైలోని వాంఖేడే స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పిచ్ రిపోర్ట్ ఇలా..


వాంఖడే స్టేడియంలోని పిచ్ బ్యాట్స్‌మెన్‌కు స్వర్గధామం. బ్యాట్‌పైకి బంతి సులభంగా వస్తుంది. దీంతో బ్యాట్స్‌మెన్ పండగ చేసుకునే అవకాశం ఉంది. ఈ పిచ్‌ కొంచెం స్పిన్నర్లకు సహరిస్తుంది. బ్యాట్స్‌మెన్ కాస్త క్రీజ్‌లో కుదుకుంటే పరుగుల వరదపారించొచ్చు. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్‌కు మొగ్గు చూపే అవకాశం ఉంది. హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 31 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ముంబై 22, కోల్‌కతా 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ముంబైపై గెలుపు కోల్‌కతాకు అంత సులువు కాదని ఈ గణాంకాలు చూస్తే అర్థమవుతోంది. పైగా సొంతగడ్డపై ఆడుతుండడంతో ముంబైకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  


ముంబై జట్టు విషయానికి వస్తే.. గత మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడం ఆ జట్టుకు పెద్ద బలం. ఇషాన్ కిషన్ కూడా మంచి టచ్‌లోనే ఉన్నాడు. వీరిద్దరు చెలరేగితే కేకేఆర్‌కు కష్టాలే. వన్‌డౌన్‌లో తిలక్ వర్మ కూడా సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ముంబై ఆందోళన అంతా సూర్యకుమార్ యాదవ్ గురించే. ఒక్క మంచి ఇన్నింగ్స్ ఆడితే ఈ స్టార్ బ్యాట్స్‌మెన్ మళ్లీ గాడిపడతాడు. సూర్య ఎప్పుడు సిక్సర్ల వర్షం కురిపిస్తాడా..? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కామెరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్ గత మ్యాచ్‌లో మంచి ఫినిషింగ్ ఇచ్చి జట్టును గెలిపించారు. బౌలింగ్ ఇంకా పూర్తిస్థాయిలో కుదురుకోలేదు. అర్షద్‌ ఖాన్, పీయూష్ చావ్లా, హృతిక్ షోకీన్, రిలే మెరెడిత్ ఎలా రాణిస్తారో చూడాలి. 


మరోవైపు కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ బాగానే ఉన్నా ఒకసారి ఒకరు ఆడితే.. మరోసారి విఫలమవుతున్నారు. స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్‌ను ఈ మ్యాచ్‌లో బరిలో దింపే అవకాశం కనిపిస్తోంది. రాయ్ జట్టులోకి వస్తే.. రహ్మానుల్లా గుర్బాజ్‌కు రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. వెంకటేష్ అయ్యర్, కెప్టెన్ నితీష్ రాణా, రింకూ సింగ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. భారీ హిట్టర్ ఆండ్రీ రస్సెల్ బంతితో మెరుపులు మెరిపిస్తున్నా.. బ్యాట్‌తో పరుగులు చేయాల్సి ఉంది. బౌలింగ్‌లో ఉమేష్ యాదవ్, ఫెర్గ్యూసన్ ధారళంగా పరుగులు ఇస్తున్నారు. గత మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్‌తో కేవలం ఐదు బంతులే వేయించారు. సునీల్ నరైన్ పరుగులు చేయకుండా కట్టడి చేస్తున్నాడు. వరుణ్‌ చక్రవర్తి, సుయాష్ శర్మ మరింత పదునుగా బౌలింగ్ చేయాల్సి ఉంది.


Also Read: 7th Pay Commission: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. డీఏ పెంపుపై ప్రకటన  


రెండు జట్ల ప్లేయింగ్ 11 ఇలా.. (అంచనా)


ముంబై ఇండియన్స్‌: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్, నేహాల్ వధేరా, హృతిక్ షోకీన్, అర్షద్ ఖాన్, పీయూష్ చావ్లా, రిలే మెరెడిత్ .


కోల్‌కతా నైట్ రైడర్స్: జేసన్ రాయ్/రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), నారాయణ్ జగదీశన్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గ్యూసన్, వరుణ్ చక్రవర్తి, ఉమేష్ యాదవ్. 


డ్రీమ్ 11 టీమ్ (MI vs KKR Dream11)
వికెట్ కీపర్: ఇషాన్ కిషన్ (కెప్టెన్)
బ్యాటర్లు: రోహిత్ శర్మ, వెంకటేష్ అయ్యర్, తిలక్ వర్మ, నితీష్ రాణా, రింకూ సింగ్
ఆల్ రౌండర్లు: కెమెరూన్ గ్రీన్, ఆండ్రీ రస్సెల్ (వైస్ కెప్టెన్), సునీల్ నరైన్ 
బౌలర్లు: మెరెడిత్, వరుణ్ చక్రవర్తి


Also Read:  IPL Records: ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత చెత్త ఓవర్లు ఇవే.. ఆ ముగ్గురు బౌలర్లు ఎవరంటే..?    



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook