LSG vs DC: లక్నో Vs ఢిల్లీ జట్ల మధ్య టఫ్ వార్.. ప్లేయింగ్ 11 ఇదే..!
Lucknow Super Giants Vs Delhi Capitals Playing 11: ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్ మరోసారి నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఢిల్లీ జట్టు వార్నర్ నేతృత్వంలో బరిలోకి దిగుతోంది. నేడు లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ జట్ల మధ్య టఫ్ వార్ ఉండనుంది. తుదిజట్లు ఎలా ఉండనున్నాయి..?
Lucknow Super Giants Vs Delhi Capitals Playing 11: ఐపీఎల్ మూడో మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. గత సీజన్‌లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన లక్నో సూపర్ జెయింట్స్.. అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది. ప్లే ఆఫ్ చేరుకుని.. ఫైనల్‌కు చేరువగా వచ్చింది. ఈ సీజన్‌లో కూడా అదే ఆటతీరును కంటిన్యూ చేయాలని చూస్తోంది. మరోవైపు రిషబ్ పంత్ జట్టుకు దూరమవ్వడంతో డేవిడ్ వార్నర్ నాయకత్వంలో ఢిల్లీ బరిలోకి దిగుతోంది. రెండు జట్ల ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉండనుంది..? పిచ్ రిపోర్టు.. హెడ్ టు హెడ్ రికార్డుల వివరాలు ఇలా..
పిచ్ రిపోర్ట్..
లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియం వేదికగా లక్నో, ఢిల్లీ జట్లు తలపడనున్నాయి. టీ20 పరంగా ఇక్కడి పిచ్ చాలా సమతుల్యంగా ఉంటుంది. పిచ్ బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్‌లకు సమానంగా సహరిస్తుంది. బ్యాట్‌కు, బంతికి మధ్య ఆసక్తికర సమరం ఉండనుంది. ఈ గ్రౌండ్‌లో జరిగిన 6 టీ20 మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 5 సార్లు విజయం సాధించింది. టాస్ ఇక్కడ కీలక పాత్ర పోషించనుంది. ఫస్ట్ బ్యాటింగ్ సగటు స్కోరు 151 పరుగులు. స్పిన్ బౌలర్లు ఇక్కడ ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది.
లక్నో సూపర్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ తలపడతాయి
హెడ్ టు హెడ్ రికార్డులు..
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు లక్నో, ఢిల్లీ మధ్య 2 మ్యాచ్‌లు జరగ్గా. రెండు మ్యాచ్‌ల్లోనూ లక్నో సూపర్ జెయింట్ విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో.. రెండో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గణాంకాలను చూస్తే లక్నో మరోసారి విజయం సాధించే అవకాశం ఉంది. అయితే డేవిడ్ వార్నర్ నాయకత్వంలోని ఢిల్లీ కూడా చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. కెప్టెన్‌గా వార్నర్‌కు ఐపీఎల్‌లో మంచి రికార్డు ఉండడం కలిసి వచ్చే అంశం.
పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. వీరికితోడు రంజీల్లో అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్ ఎలా ఆడతాడనే ఆసక్తి నెలకొంది. బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, అమన్ ఖాన్ వంటి ప్లేయర్లతో బలంగా ఉంది.
కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో లక్నో సూపర్ జెయింట్స్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. కైల్ మేయర్స్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, స్టోయినిస్ వంటి మ్యాచ్ విన్నర్లతో ప్రత్యర్థికి సవాల్ విసరుతోంది. బౌలింగ్‌లో మార్క్ వుడ్, అవేశ్ ఖాన్, జయదేవ్ ఉనద్కట్, రవి బిష్టోయ్ వంటి టాప్ క్లాస్ బౌలర్లు ఉండడంతో విజయంపై ధీమాగా ఉంది.
రెండు జట్ల ప్లేయింగ్ ఎలెవెన్ ఇలా (అంచనా)..
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, మార్క్ వుడ్, అవేష్ ఖాన్, జయదేవ్ ఉనద్కట్, రవి బిష్ణోయ్.
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, రిలే రోసో, సర్ఫరాజ్ ఖాన్ (వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్.
Also Read: IPL 2023: ఐపీఎల్‌లో అత్యధికంగా సంపాదించిన టాప్-5 ఆటగాళ్లు వీళ్లే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook