Jasprit Bumrah Back: జస్ప్రీత్ బుమ్రా బ్యాక్.. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో రచ్చ!
MI Pacer Jasprit Bumrah made his first appearance in IPL 2023 after back surgery. జస్ప్రీత్ బుమ్రా చాలా రోజుల తర్వాత అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రత్యక్షమయ్యాడు.
MI Pacer Jasprit Bumrah made his first appearance in IPL 2023 after back surgery: టీమిండియా పేసర్, ముంబై ఇండియన్స్ కీలక బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చాలా రోజుల తర్వాత అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రత్యక్షమయ్యాడు. అయితే బుమ్రా మ్యాచ్ ఆడడం లేదు. ఐపీఎల్ 2023లో భాగంగా ప్రస్తుతం ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ను చూసేందుకు స్టేడియంకు వచ్చాడు. స్టేడియంలో అభిమానుల మధ్య ముంబై పేసర్ సందడి చేశాడు. వెన్ను శస్త్రచికిత్స తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో బుమ్రా తొలిసారిగా కనిపించాడు.
గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఉత్సాహపరిచేందుకు నరేంద్ర మోడీ స్టేడియంకు జస్ప్రీత్ బుమ్రా చేరుకున్నాడు. టాస్ అనంతరం బుమ్రా తమ జట్టుకు చీర్స్ చెబుతున్న ఫొటోను 'ముంబై ఇండియన్స్' ప్రాంచైజీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. 'బూమ్.. బూమ్.. బుమ్రా' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇందుకు సంబందించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతొంది. చాలా రోజుల తర్వాత బుమ్రాను చూసి ముంబై అభిమానులు సంతోషించారు.
ఇటీవలే వెన్ను గాయానికి సర్జరీ చేయించుకున్న జస్ప్రీత్ బుమ్రా.. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్సీఏలో పునరావాసం పొందుతున్నాడు. దాంతో ఐపీఎల్ 2023లో అతడు ఆడటం అసాధ్యం. అంతేకాదు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023 మ్యాచ్‌కు కూడా బీసీసీఐ అతడిని ఎంపిక చేయలేదు. ఇక ఈ ఏడాది చివర్లో జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023ను దృష్టిలో ఉంచుకుని బుమ్రాకు బీసీసీఐ విశ్రాంతిని ఇస్తోంది. బుమ్రా త్వరగా జట్టులోకి రావాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు చెలరేగారు. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (56; 34 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేయగా.. డేవిడ్ మిల్లర్ (46; 22 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), అభినవ్ మనోహర్ (42; 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), రాహుల్ తెవాతియా (20; 5 బంతుల్లో 3 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ముంబై బౌలర్లలో పీయూష్ చావ్లా 2 వికెట్స్ తీయగా.. అర్జున్ టెండూల్కర్, జాసన్ బెరెన్‌డార్ఫ్, రిలే మెరిడిత్, కుమార్ కార్తికేయ ఒక్కో వికెట్ పడగొట్టారు.
Also Read: Tamannaah Bhatia Pics: అసలే మిల్కి బ్యూటీ.. అందులోనూ వైట్ డ్రెస్! తమన్నా భాటియా అందం వేరే లెవల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.