Jos Buttler Record: జోస్ బట్లర్ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో మూడో ఆటగాడిగా!
RR Opener Jos Buttler completes 3000 runs in IPL History. రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జాస్ బట్లర్ అరుదైన రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్‌లో మూడువేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు.
RR Opener Jos Buttler completes 3000 runs in IPL History: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పోరాడే స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ (52; 36 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ బాధగా.. దేవదత్ పడిక్కల్ (38; 26 బంతుల్లో 5 ఫోర్లు) కీలక పరుగులు చేశాడు. ఆర్ అశ్విన్ (30; 22 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), షిమ్రాన్ హెట్‌మయర్ (30; 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. చెన్నై బౌలర్లలో ఆకాశ్ సింగ్ 2, తుషార్ దేశ్‌పాండే 2, రవీంద్ర జడేజా 2 తలో రెండు వికెట్స్ పడగొట్టారు.
ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జాస్ బట్లర్ అరుదైన రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్‌లో మూడువేల పరుగుల మార్క్‌ను బట్లర్ అందుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 52 రన్స్ చేయడంతో ఈ ఫీట్ సాధించాడు. ఇంగ్లండ్ ఓపెనర్ అయిన బట్లర్ 85 ఇన్నింగ్స్‌ల్లో ఐపీఎల్‌లో 3 వేల మార్క్‌ను చేరుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా మూడు వేల పరుగుల మార్క్‌ను అందుకున్న మూడో ఆటగాడిగా బట్లర్ నిలిచాడు.
ఐపీఎల్‌లో మూడువేల పరుగుల మార్క్‌ను వేగంగా అందుకున్న జాబితాలో వెస్టిండీస్ మాజీ ప్లేయర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ తొలి స్థానంలో ఉన్నాడు. గేల్ 75 ఇన్నింగ్స్‌ల్లో 3 వేల పరుగుల మార్క్‌ను అందున్నాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 80 ఇన్నింగ్స్‌ల్లో మూడు వేల పరుగుల మార్క్‌ను అందుకొని రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (94 ఇన్నింగ్స్‌లు), ఐదో స్థానంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (95 ఇన్నింగ్స్‌లు) ఉన్నారు.
Also Read: Lovers Viral Video: వీధిలో యువతితో పెద్దాయన రొమాన్స్.. చివరికి ఏమైందంటే? వీడియో చూస్తే పొట్ట చెక్కలే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.