Josh Hazlewood & Glenn Mxwell Doubtful for IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్ ముంగిట రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఫ్రాంచైజీకీ భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది.  ముగ్గురు స్టార్‌ ప్లేయర్స్ గాయాల కారణంగా ఐపీఎల్ 2023 పూర్తి సీజన్‌కు అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. ఆస్ట్రేలియా స్టార్‌ ఆటగాళ్లు గ్లేన్ మ్యాక్స్‌వెల్, జోష్‌ హాజిల్‌వుడ్‌.. భారత ఆటగాడు బ్యాటర్‌ రజత్‌ పాటిదార్‌ ఐపీఎల్ 2023 ఆరంభ మ్యాచులు ఆడడం దాదాపుగా అసాధ్యమే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Josh Hazlewood: మడమ సమస్య కారణంగా జోష్‌ హాజిల్‌వుడ్‌ ఐపీఎల్ 2023 మొత్తానికే దూరమయ్యే అవకాశం ఉంది. గాయం కారణంగా ఇటీవల ముగిసిన భారత్‌ పర్యటనకు (టెస్ట్‌, వన్డే సిరీస్‌) దూరంగా ఉన్నాడు. గాయం వలనే ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం అవుతున్నాడని సమాచారం. అయితే గాయం నుంచి కోలుకుని కనీసం రెండో దశ మ్యాచ్‌లకైనా అందుబాటులో ఉండాలని హాజిల్‌వుడ్‌ భావిస్తున్నాడు. ఒకవేళ హాజిల్‌వుడ్‌ సీజన్‌ మొత్తానికే దూరమైతే ఆర్‌సీబీకి ఇది భారీ షాక్ అనే చెప్పాలి. 2022 మెగా వేలంలో హాజిల్‌వుడ్‌ను ఆర్‌సీబీ రూ. 7.75 కోట్లకు సొంతం చేసుకుంది.


Glenn Mxwell: పూర్తి ఫిట్‌నెస్ లేని నేపథ్యంలో ఐపీఎల్ 2023లో బరిలోకి దిగడం కష్టమేనని గ్లేన్ మ్యాక్స్‌వెల్ తాజాగా తెలిపాడు. ప్రస్తుతం తన కాళ్లు బాగానే ఉన్నాయని, 100 శాతం ఫిట్‌నెస్ సాధించాడానికి మరికొంత సమయం పడుతుందన్నాడు. త్వరగా కోలుకుని టోర్నీలో బాగా ఆడాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నానని మ్యాక్స్‌వెల్ పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్ 2022 ముగిసిన తర్వాత పార్టీకి వెళ్లిన మ్యాక్సీ పూటుగా తాగి కాలు విరగ్గొట్టుకున్నాడు. సుమారు 4-5 నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న మ్యాక్సీ.. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‌తో మైదానంలో అడుగుపెట్టాడు. తొలి వన్డేలో 8 పరుగులు చేసిన మ్యాక్సీ.. ఫిట్‌నెస్ సమస్యలతో చివరి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు.


Rajat Patidar: ఐపీఎల్ 2023 ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై సెంచరీ చేసిన రజత్‌ పాటిదార్‌ గాయం కారణంగా ప్రస్తుతం ఎన్‌సీఏలో పునరావాసం పొందుతున్నాడు. 2023 ఆర్‌సీబీ ట్రయినింగ్‌ క్యాంప్‌ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు పాటిదార్‌ గాయం బారిన పడ్డాడు. మరో మూడు వారాలు రెస్ట్‌ అవసరం అని ఎన్‌సీఏ అధికారులు సూచించారు. దాంతో ఐపీఎల్ 2023 ఫస్ట్‌ హాఫ్‌ మ్యాచ్‌లకి అతడు దూరం అయ్యాడు. ఇప్పటికే విల్ జాక్స్ గాయంతో దూరమవ్వగా అతని స్థానాన్ని న్యూజిలాండ్ ప్లేయర్ మైఖేల్ బ్రేస్‌వెల్‌ను తీసుకున్న విషయం తెలిసిందే. ముగ్గురూ అందుబాటులో లేకుంటే ఈ సీజన్‌లోనూ ఆర్‌సీబీ వైఫల్యాల పరంపర కొనసాగే అవకాశం ఉంది.   


Also Read: Mahindra XUV400 EV: సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వచ్చేసింది.. ఇక టాటా నెక్సాన్ ఈవీకి గుడ్ బై చెప్పాల్సిందే!


Also Read: Best Mileage Cars 2023: 7 లక్షల కంటే తక్కువ ధర.. 34 కిలోమీటర్ల మైలేజ్! స్టైలిష్ లుకింగ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి