Samantha-MS Dhoni: అయ్యా బాబోయ్.. ఎంఎస్ ధోనీ అంత కూల్‌గా ఎలా ఉంటాడో: సమంత
Vijay Deverakonda imitate MS Dhoni Batting Style. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై స్టార్ హీరోయిన్ సమంత ప్రశంసల వర్షం కురిపించారు.
Kushi Movie Heroine Samantha Heap Praise on MS Dhoni Cool Captaincy: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటిస్తున్న సినిమా 'ఖుషి'. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఖుషి సినిమా.. సెప్టెంబర్ 1న విడుదల కానుంది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. ఖుషి విడుదలకు సమయం ఉన్నా.. చిత్ర యూనిట్ మాత్రం ఇప్పటినుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టింది.
ప్రమోషన్స్‌లో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2023ని ఖుషి చిత్ర యూనిట్ వాడేసుకున్నారు. హీరోహీరోయిన్ విజయ్ దేవరకొండ, సమంత తాజాగా స్టార్ స్పోర్ట్స్ షోలో పాల్గొన్నారు. బుధవారం రాత్రి చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా సమంత-విజయ్ చిట్ చాట్‌కు సంబంధించిన వీడియోను ప్లే చేశారు. ఇక అంతకుముందు విడుదల చేసిన ప్రొమోలో చెన్నై టీమ్, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి అడగ్గా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే ధోనీపై సామ్ ప్రశంసల వర్షం కురిపించారు.
సమంత మాట్లాడుతూ... 'ఎంఎస్ ధోనీ పర్ఫెక్షనిస్ట్. ఎప్పుడూ ప్రశాంతంగా ఎలా ఉంటాడో అర్థం కాదు. తన చుట్టూ ఏం జరిగినా చాలా కూల్‌గా కనిపిస్తాడు. తన పని తాను చేసుకుంటూ పోతాడు' అని అన్నారు. ఆపై విజయ్ దేవరకొండ మాట్లాడుతూ... 'నా ఫేవరేట్ ఆటగాడు ఎంఎస్ ధోనీ. లాంగ్ హెయిర్‌తో, రైల్వే బ్యాక్ గ్రౌండ్‌తో రాంచీ నుంచి వచ్చి భారత జట్టు కెప్టెన్‌గా ఎదగడం గొప్ప విషయం. ధోనీ కెరీర్ ప్రారంభంలో ప్రతీ బంతిని స్టేడియం బయటికి కొట్టేవాడు. నేను చాలా ఎంజాయ్ చేసేవాడిని' అని పేర్కొన్నాడు. అనంతరం సమంత, విజయ్ కలిసి 'విజిల్ పోడు' అంటూ విజిల్ వేసారు.
ఈ చిట్‌చాట్ సందర్భంగా విజయ్ దేవరకొండ, సమంత భారత ప్లేయర్ల బ్యాటింగ్ స్టైల్ బట్టి వారి పేర్లను చెప్పారు. ఆపై క్రికెట్ దిగ్గజం సచిన్ బ్యాటింగ్ స్టైల్‌ను సమంత ఇమిటేట్ చేశారు. ఇక భారత జట్టుకు మూడు ఐసీసీ టైటిల్స్ అందించిన ఎంఎస్ ధోనీ 'హెలికాప్టర్ షాట్'ను రౌడీ హీరో ఇమిటేట్ చేశాడు. ఐపీఎల్ 2023లో తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరాలని కోరుకుంటున్నట్లు విజయ్ తెలిపాడు. హైదరాబాద్ చివరి నాలుగు మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్స్ వెళుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, సమంత చిట్‌చాట్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read: Ambati Rayudu-YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన క్రికెటర్ అంబటి రాయుడు!
Also Read: IPL 2023 Playoff Scenario: ఢిల్లీ ఔట్.. సన్‌రైజర్స్ డౌట్! ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.