ఉత్కంఠభరిత పోరులో చెన్నై చిత్తు.. గుజరాత్‌దే తొలి గెలుపు

Sat, 01 Apr 2023-10:09 am,

IPL 2023 Gujarat Titans Vs Chennai Super Kings Match 1 Live Updates. ఐపీఎల్‌ 2023 తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ (GT vs CSK) జట్ల మధ్య ఆరంభం కానుంది. లైవ్ అప్‌డేట్స్ మీ కోసం.

IPL 2023 Gujarat Titans Vs Chennai Super Kings Match 1 Live Updates: ఉత్కంఠభరితంగా సాగిన తొలి మ్యాచ్‌లో చెన్నైను గుజరాత్ చిత్తు చేసింది. ఆఖర్లో రషీద్ ఖాన్, తైవాటియా మెరుపులు మెరిపించి జట్టుకు విజయాన్ని అందించారు. 179 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే గుజరాత్ ఛేదించింది. గిల్ (63) పరుగులతో మంచి పునాది వేయగా.. విజయ్ శంకర్ (27) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (92) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 

Latest Updates

  • ఐపీఎల్ 2023 సీజన్‌లో మొదటి మ్యాచ్‌లో గుజరాత్ జయకేతనం ఎగురవేసింది. చివరి ఓవర్‌లో విజయానికి ఆరు పరుగులు చేయాల్సి ఉండగా.. తైవాటియా వరుసగా సిక్స్, ఫోర్ బాది జట్టును గెలిపించాడు. గుజరాత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సొంతం చేసుకుంది.

  • 19 ఓవర్‌లో రషీద్‌ ఖాన్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఓ సిక్సర్, ఫోర్ బాదడంతో ఈ ఓవర్‌లో మొత్తం 15 రన్స్ వచ్చాయి. 6 బంతుల్లో 8 రన్స్ చేస్తే గుజరాత్‌దే విజయం.
     

  • కీలక సమయంలో విజయ్ శంకర్‌ (27) వికెట్‌ను కోల్పోయింది గుజరాత్. భారీ షాట్‌కు యత్నించిన విజయ్.. శాంట్నర్‌కు చిక్కాడు. గుజరాత్ విజయానికి 12 బంతుల్లో 23 కావాలి.
     

  • మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా మారింది. గుజరాత్ విజయానికి 18 బంతుల్లో 30 రన్స్ కావాలి. స్కోరు బోర్డు 149/4 (17)

  • 16 ఓవర్లు: గుజరాత్ టైటాన్స్ స్కోర్ 145/4. 24 బంతుల్లో 34 పరుగులు చేస్తే గుజరాత్ విజయం సాధిస్తుంది. క్రీజ్‌లో విజయ్ శంకర్ (19), తెవాటియా (1) ఉన్నారు.

  • చెన్నై జట్టు రేసులోకి వచ్చింది. క్రీజ్‌లో పాతుకుపోయిన ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ (36 బంతుల్లో 63, ఆరు ఫోర్లు, 3 సిక్సర్లు)ను ఇంపాక్ట్ ప్లేయర్ తుషార్ పాండే ఔట్ చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ చక్కగా క్యాచ్ అందుకున్నాడు. స్కోరు బోర్డు 15 ఓవర్లలకు 138-4.

  • గుజరాత్ విజయానికి 36 బంతుల్లో 52 రన్స్ చేయాల్సి ఉంది. క్రీజ్‌లో శుభ్‌మన్ గిల్ (56), విజయ్‌ శంకర్ (9) ఉన్నారు. స్కోరు బోర్డు 127/3 (14).
     

  • 13 ఓవర్లు: గుజరాత్ టైటాన్స్ స్కోర్ 114-3. క్రీజ్‌లో శుభ్‌మన్ గిల్ (51), విజయ్ శంకర్ (2) ఉన్నారు.  

  • గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా గింగిరాలు తిప్పే బంతితో కెప్టెన్ హర్ధిక్ పాండ్యా (8)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. 
     

  • అద్భుత ఫామ్‌లో ఉన్న యంగ్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ (51) ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ బాదేశాడు. గుజరాత్ విజయానికి 48 బంతుల్లో  68 రన్స్ కావాలి. స్కోరు బోర్డు 111/2 (12).
     

  • గుజరాత్ స్కోరు 100 పరుగులు దాటింది. రవీంద్ర జడేజా వేసిన 11వ ఓవర్‌లో గిల్ ఓ సిక్స్, ఫోర్ బాదడంతో ఈ ఓవర్‌లో మొత్తం 13 పరుగులు వచ్చాయి. స్కోరు బోర్డు 106/2 (11).
     

  • గుజరాత్ జట్టు పది ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 93 రన్స్ చేసింది. క్రీజ్‌లో గిల్ (38), హార్ధిక్ పాండ్యా (3) ఉన్నారు.
     

  • గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. గాయపడిన విలియమ్సన్ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సాయి సుదర్శన్‌ (22) రాజవర్ధన్ హంగేర్కర్ బౌలింగ్‌లో ధోనికి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. 
     

  • 9 ఓవర్లు: గుజరాత్ టైటాన్స్ స్కోర్ 89-1 క్రీజులో శుభ్‌మన్ గిల్ (38), సాయి సుదర్శన్ (22) ఉన్నారు.  
     

  • శుభ్‌మన్ గిల్ (33), సాయి సుదర్శన్ (19) దూకుడు కొనసాగుతోంది. దీంతో గుజరాత్ లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది.
     

  • పవర్ ప్లే ముగియడంతో ధోని స్పిన్నర్లను రంగంలోకి దింపాడు. ఏడో ఓవర్‌లో రవీంద్ర జడేజా 6 పరుగులు ఇచ్చాడు. స్కోరు బోర్డు 71/1 (7).
     

  • గుజరాత్ లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. శుభ్‌మన్ గిల్ (25), సాయి సుదర్శన్ (11) క్రీజ్‌లో ఉన్నాడు. స్కోరు బోర్డు 65/1 (6).

  • గుజరాత్ స్కోరు 50 పరుగులు దాటింది. ఐదో ఓవర్‌లో గిల్ ఓ ఫోర్, సిక్సర్ బాదడంతో మొత్త 15 పరుగులు వచ్చాయి. 5 ఓవర్లకు 56/1.

  • గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. దూకుడు మీదున్న వృద్ధిమాన్ సాహా (25, 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు)ను రాజవర్ధన్ హంగేర్కర్ ఔట్ చేశాడు. దీంతో 37 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. స్కోరు బోర్డు 41/1 (4).

  • మూడో ఓవర్‌లో వృద్ధిమాన్ సాహా మరో సిక్సర్ బాదాడు. ఈ ఓవర్‌లో మొత్తం 11 రన్స్ వచ్చాయి. స్కోర్ బోర్డు 29/0 (3).

  • రెండో ఓవర్‌లో గుజరాత్ ఓపెనర్లు దూకుడు పెంచాడు. వృద్ధిమాన్ సాహా సిక్స్, ఫోర్ బాదగా.. గిల్ ఓ బౌండరీ కొట్టాడు. దీంతో ఈ ఓవర్‌లో మొత్తం 15 పరుగులు వచ్చాయి. 

  • దీపక్ చాహర్ తొలి ఓవర్‌లో కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. గిల్, సాహా చెరో సింగిల్ తీశాడు. 

  • 179 పరుగుల లక్ష్యంతో గుజరాత్ టైటాన్స్ బరిలోకి దిగింది. ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా క్రీజ్‌లోకి వచ్చారు. 
     

  • ఈ మ్యాచ్‌లో రుతురాజ్‌ గైక్వాడ్ (92) అద్భుత ఇన్నింగ్స ఆడాడు. స్టేడియం మొత్తం సిక్సర్ల వర్షం కురిపించాడు. 
     

  • గుజరాత్ బౌలర్లలో షమీ, రషీద్ ఖాన్, జోసఫ్‌ తలో రెండు వికెట్లు తీయగా.. లిటిల్ ఒక వికెట్ పడగొట్టాడు. 

  • చెన్నై ఇన్నింగ్స్ ముగిసింది. చివరి ఓవర్‌లో ధోని (14) సిక్సర్, ఫోర్ బాదడంతో మొత్తం 13 రన్స్ వచ్చాయి. రుతురాజ్ జోరుతో ఓ దశలో భారీ స్కోరు చేస్తుందని భావించినా.. గుజరాత్ బౌలర్లు పుంజుకోవడంతో బ్రేకులు పడ్డాయి. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 రన్స్ చేసింది.

  • 19 ఓవర్లు: చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్కోర్ 165-7. క్రీజులో ఎంఎస్‌ ధోని (2), శాంట్నర్ (1) ఉన్నారు. ఈ ఓవర్‌లో 10 పరుగులు వచ్చాయి. 
     

  • చెన్నై వికెట్ల పతనం ఆగడం లేదు. 19వ ఓవర్ షమీ బౌలింగ్‌లో ఓ సిక్సర్ బాదిన శివం ధూబే (19).. తరువాతి బంతికి రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
     

  • 18వ ఓవర్‌ను జోసఫ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రెండు వికెట్లు తీసి.. కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. స్కోరు బోర్డు 155/6 (18) 
     

  • చెన్నై సూపర్ కింగ్స్ ఆరో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా (1) భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. కెప్టెన్ ధోని క్రీజ్‌లోకి వచ్చాడు.
     

  • రుతురాజ్ గైక్వాడ్ (49 బంతుల్లో 92) సంచలన ఇన్నింగ్స్‌కు తెరపడింది. జోసఫ్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. 
     

  • రుతురాజ్‌ మళ్లీ జోరందుకున్నాడు. 17వ ఓవర్ రషీద్ ఖాన్‌ బౌలింగ్‌లో తొలి బంతికే సిక్సర్ బాదాడు. ఈ ఓవర్‌లో మొత్తం 11 పరుగులు వచ్చాయి.
     

  • గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. దీంతో స్కోరు వేగం మందగించింది. స్కోరు బోర్డు  140/4 (16).
     

  • 15 ఓవర్లు: చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్కోర్ 133/4. క్రీజులో రుతురాజ్ గైక్వాడ్ (80), శివం ధూమే (4) ఉన్నారు. ఈ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. 
     

  • చెన్నై జోరుకు కాస్త బ్రేకులు పడ్డాయి. 14వ ఓవర్‌లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే వచ్చాయి. స్కోరు బోర్డు 125/4 (14).

  • 13 ఓవర్లు ముగిసేసరికి చెన్నై సూపర్‌ కింగ్స్‌ 4 వికెట్ల నష్టానికి 121 రన్స్ చేసింది. క్రీజులో రుతురాజ్ గైక్వాడ్ (76), శివం ధూబే (0) ఉన్నారు. 

  • 13వ ఓవర్‌లో చెన్నై జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. అంబటి రాయుడు (12)ను లిటిల్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. 

  • 12 ఓవర్లు: చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్కోర్ 114/3. క్రీజులో రుతురాజ్ గైక్వాడ్ (70), అంబటి రాయుడు (11) ఉన్నారు. ఈ ఓవర్‌లో రుతురాజ్, అంబటి రాయుడు తలో సిక్సర్ బాదారు. 
     

  • రుతురాజ్ జోరు తగ్గడం లేదు. 11వ ఓవర్‌లో మరో సిక్సర్ బాదాడు. ఈ ఓవర్‌లో 7 పరుగులు వచ్చాయి. స్కోరు 11 ఓవర్లకు 100/3.

  • 10 ఓవర్‌ను రషీద్ ఖాన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ఈ ఓవర్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే వచ్చాయి. స్కోరు 10 ఓవర్లకు 93/3.

  • ఓ వైపు వికెట్లు పడుతున్నా.. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (56) చెలరేగుతున్నాడు. 9వ ఓవర్‌లో ఏకంగా మూడు సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో ఈ సీజన్‌లో తొలి హాఫ్ సెంచరీ బాదాడు. స్కోరు 9 ఓవర్లకు 90/3.

  • 8వ ఓవర్ నాలుగో బంతికే రషీద్ ఖాన్ బౌలింగ్ బెన్ స్టోక్స్ (7) కీపర్ వృద్ధిమాన్ సాహాకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. 8 ఓవర్లకు 72/3.

  • 7వ చివరి బంతికి ఈజీ రనౌట్‌ నుంచి రుతురాజ్ గైక్వాడ్ తప్పించుకున్నాడు. డైరెక్ట్‌గా వికెట్లకు త్రో చేయడంలో గిల్ విఫలమయ్యాడు. ఈ ఓవర్లో రుతురాజ్ రెండు సిక్సర్లు బాదడంతో మొత్తం 13 రన్స్ వచ్చాయి. ప్రస్తుతం స్కోరు 7 ఓవర్లకు 64-2.
     

  • 6 ఓవర్లకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్కోర్ 51/2. క్రీజులో రుతురాజ్ గైక్వాడ్ (24), బెన్ స్టోక్స్ (1) క్రీజులో ఉన్నారు. 
     

  • చెన్నై సూపర్‌ కింగ్స్‌ రెండో వికెట్ కోల్పోయింది. స్టార్ బ్యాటర్ మొయిన్ అలీ (1) ఔటయ్యాడు. రషీద్ ఖాన్ వేసిన 6వ ఓవర్ ఇదో బంతికి క్యాచ్ ఔట్ అయ్యాడు. 
     

  • 4 ఓవర్లు ముగిసేసరికి చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఒక వికెట్ నష్టానికి 29 రన్స్ చేసింది. క్రీజులో రుతురాజ్ గైక్వాడ్ (23), మొయిన్ అలీ (4) క్రీజులో ఉన్నారు. ఈ ఓవర్లో 15 రన్స్ వచ్చాయి. 

  • మూడో ఓవర్ ముగిసేసరికి చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఒక వికెట్ నష్టానికి 14 రన్స్ చేసింది. క్రీజులో రుతురాజ్ గైక్వాడ్ (12), మొయిన్ అలీ (0) ఉన్నారు. 

  • చెన్నై సూపర్‌ కింగ్స్‌ మొదటి వికెట్ కోల్పోయింది. డెవాన్ కాన్వే (1) ఔటయ్యాడు. మొహ్మద్ షమీ వేసిన 3వ ఓవర్ రెండో బంతికి బోల్డ్ అయ్యాడు. 
     

  • 2 ఓవర్లు: చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్కోర్ 13/0. క్రీజులో డెవాన్ కాన్వే (1), రుతురాజ్ గైక్వాడ్ (11) ఉన్నారు. 
     

  • మొదటి ఓవర్ ముగిసేసరికి చెన్నై సూపర్‌ కింగ్స్‌ వికెట్ కోల్పోకుండా 2 రన్స్ చేసింది. క్రీజులో డెవాన్ కాన్వే (0), రుతురాజ్ గైక్వాడ్ (1) ఉన్నారు. 
     

  • గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): 
    వృద్ధిమాన్ సాహా (కీపర్), శుభమాన్ గిల్, కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, జాషువా లిటిల్, యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్. 
     

  • ఐపీఎల్‌ 2023 ఆరంభ మ్యాచులో గుజరాత్‌ టైటాన్స్‌ సారథి హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో చెన్నై ముందుగా బ్యాటింగ్ చేయనుంది. మ్యాచ్ 7.30 గంటలకు ఆరంభం కానుంది. 
     

  • ఐపీఎల్‌ 2023 ఆరంభ వేడుకల్లో బాలీవుడ్ నటి మందిరా బేడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆరంభ వేడుకులకు మందిరా హోస్ట్‌గా వ్యవహరించి అందర్నీ ఆకట్టుకున్నారు. 

  • చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, గుజరాత్‌ టైటాన్స్‌ సారథి హార్దిక్ పాండ్యా ప్రత్యేక వాహనంలో  ఐపీఎల్‌ 2023 ఆరంభ వేదికపైకి వచ్చి.. ఐపీఎల్ ట్రోఫీతో ఫొటో దిగారు. 

  • సౌత్ స్టార్ హీరోయిన్ రష్మిక మందాన ఐపీఎల్ 2023 ఆరంభ వేడుకల్లో మెరిశారు. పుష్ప సినిమాలోని ‘సామి సామి ’, ‘శ్రీ వల్లి’ పాటలకు స్టెప్పులేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నాటు నాటు’ పాటకూ డాన్స్ చేసి అభిమానులను అలరించింది.

  • ఐపీఎల్ 2023 ఆరంభ వేడుకల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా సందడి చేశారు. పలు భాషల పాటలకు డ్యాన్స్‌ చేస్తూ ప్రేక్షకులను అలరించారు. ‘పుష్ప’లోని 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా' పాటకు కూడా డాన్స్ చేశారు.
     

  • అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం అభిమానులతో నిండిపోయింది. ఆరంభ వేడుకలకు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, కార్యదర్శి జై షా హాజరయ్యారు. 

  • కరోనా వైరస్ కారణంగా గత మూడేళ్లుగా ఐపీఎల్‌ ఆరంభ వేడుకలు జరగలేదు. దీంతో ఈసారి చాలా ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. 

  • స్టార్‌ గాయకుడు అర్జిత్‌ సింగ్‌ పాట పాడుతుండగా ఫాన్స్ కేరింతలు కొడుతున్నారు. 

  • ఐపీఎల్ 2023 ఆరంభ వేడుకలు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link